సంక్రాంతి పండుగకు కొన్ని పనులను చేయడం మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైంది. అయితే ఈ పనులను ఖచ్చితంగా చేయాలని పెద్దలు చెబుతుంటారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
1) ధాన ధర్మాలు చేయడం
సంక్రాంతి సమయంలో దానధర్మాలు చేయాలి. ఆనందాలను అందరితో పంచుకునే పండగే సంక్రాంతి…. కాబట్టి ఈ పండుగకు కుటుంబ సభ్యులతో పాటు పనివాళ్ళకు కొత్త బట్టలు ఇవ్వడం, ధాన్యం మరియు సరుకులు ఇవ్వడం లాంటివి చేయాలి. అదే విధంగా సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు, పిట్టలదొర, బుడబుక్కలవారు వస్తుంటారు. వారికి దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.
2) ఈగో ను వదిలిపెట్టడం
ఈ పండుగకు అహాన్ని వదలి అందరితో కలిసి పోవాలి. సంక్రాంతి పండుగకు ఫలహారాలు చేసి చుట్టుపక్కల వాళ్లతో పంచుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దాని అర్థం కూడా అహాన్ని పక్కనబెట్టి ఒకరితో ఒకరు కలిసి పోవడమే.
3) నదీ స్నానాలు చేయడం
Advertisement
సంక్రాంతి పండగ సందర్భంగా నదీస్నానాలు చేస్తూ ఉంటారు. దానికి కారణం చలికాలంలో శరీరంలో జీవక్రియలు నెమ్మదిస్తాయి. వాటిని తిరిగి వేగవంతం చేసి ఉత్తేజం నింపేందుకు చల్లని నీరు బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ కాలంలో ఉదయాన్నే లేచి నదీస్నానం చేయాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు.
4) గాలి పటాలు ఎగరవేయడం
పతంగులు ఎగురవేయడం కూడా సంక్రాంతి పండగలో భాగమే. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్లే ఈ పండగను మకర సంక్రాంతి అంటారు. అంటే ప్రకృతి లో జరిగే మార్పులు ఆహ్వానించడం. చలికాలం పూర్తయిన తర్వాత కొంతకాలానికి స్వాగతం పలికే రోజులు ఇవి.. దాంతో ఆ మార్పులను తట్టుకొనే విధంగా శరీరాన్ని సిద్ధం చేస్తూ ఎండలో గాలిపటాలు ఎగిరి వేయాలి. అలా చేయడం వల్ల శరీరానికి డి విటమిన్ అందడంతో పాటు రాబోయే ఎండాకాలాన్ని తట్టుకునే శక్తి వస్తుంది.
5) సూర్య నమస్కారాలు చేయడం
సంక్రాంతి వేళ సూర్యనమస్కారాలు చేయాలి. చలికాలంలో శరీరంపై ఎండ పడే అవకాశం లేదు. దాంతో డి విటమిన్ లోపిస్తుంది. కాబట్టి సంక్రాంతి వేళ ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరానికి సరిపడా డి విటమిన్ లభిస్తుంది.
Also read : దీప్తి షణ్ముక్ బ్రేకప్ తో డిప్రెషన్ లోకి వెళ్ళా…సిరి హన్మంత్ ఎమోషనల్….!