Home » దిల్ రాజు రెండవ భార్య తేజస్విని బ్యాక్ గ్రౌండ్ ఇదే…!

దిల్ రాజు రెండవ భార్య తేజస్విని బ్యాక్ గ్రౌండ్ ఇదే…!

by Bunty
Ad

ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతని అసలు పేరు వి వెంకట రమణారెడ్డి. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను అందించారు. తెలుగులో మొట్టమొదటిగా తాను నిర్మించిన చిత్రం దిల్. ఈ సినిమాతోనే తన పేరుని దిల్ రాజుగా మార్చుకున్నారు. ఇక దిల్ రాజు వ్యక్తిగత విషయానికి వస్తే… దిల్ రాజు భార్య అనిత 2017లో మరణించారు. తనకి ఇద్దరు పిల్లలు.

Advertisement

Advertisement

ఒక పాప, బాబు ఉన్నారు. ఇక తన భార్య చనిపోవడంతో దిల్ రాజు పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట. దీంతో తన కూతురు ఎలాగైనా తన తండ్రికి రెండవ వివాహం చేయాలని ఫిక్స్ అయిందట. దీంతో తన తండ్రిని బలవంతంగా రెండో పెళ్లికి ఒప్పించి వివాహం జరిపించారు. ఇక కూతురు మాట కాదనలేక దిల్ రాజు కూడా తన పిల్లల కోసం రెండవ వివాహానికి అతి కష్టం మీదనే ఒప్పుకున్నారట. ఇక 2020మేలో తన సొంత ఊరు అయినటువంటి నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లి జిల్లాలో వెంకటేశ్వర స్వామి గుడిలో అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్యన దిల్ రాజు వివాహం చేసుకున్నారు.

లాక్ డౌన్ కారణంగా తన వివాహానికి ఫిలిం ఇండస్ట్రీ నుండి ఎవరిని ఆహ్వానించలేదు. అది కొద్ది మంది కుటుంబ సభ్యులతో మాత్రమే దిల్ రాజు వివాహం జరిగింది. ఇక తన భార్య బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయిగా తెలుస్తోంది. ఇక ఇటీవల దిల్ రాజు మరోసారి తండ్రి అయిన విషయం కూడా తెలిసిందే. తన కొడుకు మొదటి పుట్టినరోజుని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇండస్ట్రీలోని సెలబ్రెటీలు అందరూ తరలివచ్చారు.

Visitors Are Also Reading