సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒకప్పుడు పటిష్టంగా ఉండేది. యువ ప్లేయర్స్ అద్భుత విజయాలను సాధించేవారు. 2016లో టైటిల్ కూడా కొట్టింది కానీ ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ కథ మారిపోయింది. మూడు సీజన్లుగా ఐపీఎల్ లో అట్టర్ ఫ్లాప్ అవుతుంది. 2023 సీజన్లో అయితే చివరి ప్లేస్ లో నిలిచింది. ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీ కోట్లు కుమ్మరిస్తున్న ఫలితం రావడం లేదు. అందుకే స్టార్ కోచ్ వెటోరినీని తీసుకుంది. కోచ్ గా బాధ్యతలు తీసుకున్న వెటోరి టీమ్ లో మార్పులు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
Advertisement
2023 ఐపీఎల్ కోసం ఇంగ్లాండ్ ప్లేయర్ హరిబ్రుక్ అలాగే ఇండియన్ ప్లేయర్స్ మయాంక్ అగర్వాల్ కోసం భారీగానే ఖర్చు చేశారు. కేవలం వీరిద్దరికే 21.5 కోట్లు ఖర్చు చేశారు. అందుకే వచ్చే సీజన్లో వీరిని తప్పించాలని ఫ్రాంచైజీ భావిస్తోంది. వీరికి పెట్టిన డబ్బుతో మరో ముగ్గురు ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ ను తీసుకోవాలని చూస్తోంది. టీమిండియాలో భారీగా పరుగులు సాధిస్తూ సూపర్ ఫామ్ లో ఉన్న తిలక్ వర్మ, గిల్, పృద్విషాలను వచ్చే సీజన్లో కొనుగోలు చేయాలని చూస్తోంది. ఈ ముగ్గురిలో ఇద్దరిని తీసుకున్న జట్టుకు చాలా ఉపయోగం అని ఎస్సారెచ్ భావిస్తోంది. ప్రస్తుతం గిల్ గుజరాత్ టైటాన్స్ తరపున, పృథ్విష ఢిల్లీ తరపున ఉన్నారు. వచ్చే సీజన్లో వీరు ప్రాంచైజీ మారుతారని ప్రచారం జరుగుతోంది.
Advertisement
ఈ నేపథ్యంలో వేలంలో వస్తే వీరిద్దరిని కొనుగోలు చేయాలని చూస్తోంది. అలాగే తిలక్ వర్మ మీద కూడా ఒక కన్ను వేసి ఉంది. ఇక వీరితో పాటు దేశవాలీలో ప్రతిభ ఉన్న ఆటగాళ్ల కోసం ప్రయత్నం చేస్తోంది. వేలంలో ఈ ముగ్గురికి భారీగా ధర పలికే ఛాన్స్ ఉంది. గత ఐపిఎల్ లో గిల్ టాప్ స్కోరర్ సెంచరీలతో దుమ్ము లేపాడు. ఇక తిలక్ వర్మ కూడా ఐపీఎల్లో రాణించి టీమ్ ఇండియాలో చోటు సంపాదించి అదరగొడుతున్నాడు. ఇక పృద్విషా కూడా అదరగొట్టాడు. ఇక ఈ ముగ్గురిలో ఎవరు జట్టులోకి వస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి
Virat Kohli : వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ బౌలింగ్ …?
బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన సమంత..త్వరలోనే రెండో పెళ్లి ?
బాలకృష్ణ రవితేజ మధ్య గొడవేంటి..? బాలయ్య నిజంగానే కొట్టాడా..?