ఒకప్పటి స్టార్ హీరోయిన్ అశ్విని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నటిగా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించి సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అశ్విని ఏపీలోని నెల్లూరు జిల్లాలో జన్మించింది. హీరోయిన్గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించింది. బాలనటిగా తెలుగులో భక్త దృవ, మార్కండేయ అనే చిత్రాల్లో కనిపించింది.
Advertisement
ఆ తర్వాత హీరోయిన్ గా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిది. వెంకటేష్, రాజేంద్రప్రసాద్, రాజశేఖర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే అశ్విని ఒక అబ్బాయిని రహస్యంగా ప్రేమించి వివాహం చేసుకుంది. దాంతోనే అశ్విని చిక్కుల్లో పడిపోయింది. అతికొద్ది రోజుల్లోనే అశ్వినిని తన భర్త విడిచి వెళ్లిపోయాడు. దీంతో అశ్విని మానసికంగా కృంగిపోయి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఒంటరిగా ఉండడంతో ఒక బాబును దత్తత తీసుకుంది. ఆ తర్వాత అశ్వినికి ఇండస్ట్రీలో ఎలాంటి ఆఫర్స్ రాలేదు.
Advertisement
దీంతో అశ్విని సీరియల్స్ లో నటిగా మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలోనే అశ్విని అనారోగ్యం పాలయ్యింది. ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి ఎంతో గొప్ప స్థాయికి వెళ్లిన అశ్విని పెద్దగా ఆస్తులను సంపాదించుకోలేకపోయింది. తన కుటుంబ సభ్యులే తనని దారుణంగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. చెన్నైలో ఉన్న తన ఇంటిని అమ్ముకొని చికిత్స తీసుకుంది. ఇక 2012లో అశ్విని తీవ్ర అనారోగ్యంతో మరణించింది.
ఇవి కూడా చదవండి
టాలీవుడ్ హీరోతో డేటింగ్లో సామజవరగమన హీరోయిన్ ?
బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన సమంత..త్వరలోనే రెండో పెళ్లి ?
బాలకృష్ణ రవితేజ మధ్య గొడవేంటి..? బాలయ్య నిజంగానే కొట్టాడా..?