Home » Virat Kohli : వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ బౌలింగ్ …?

Virat Kohli : వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ బౌలింగ్ …?

by Bunty
Ad

 

మెగా ఈవెంట్స్ లో సత్తా చాటాలంటే ఆల్రౌండర్లు కీలకం. 2011 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా విజయంలో ఆల్రౌండర్లు కీలక పాత్ర పోషించారు. 2007 టీ20లో వరల్డ్ కప్ లోను అదే జరిగింది. అయితే ఈసారి ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ లోను పార్ట్ టైం బౌలర్లు కీలకమని చర్చ జరుగుతోంది. ఇప్పటికే వెస్టిండీస్ తో సిరీస్ లో యువర్ బ్యాటర్స్ తో టీం మేనేజ్మెంట్ బౌలింగ్ కూడా చేయించింది.

Advertisement

పరుగులు సాధించడమే కాదు అవసరమైనప్పుడు బంతితో బాధ్యతలు పంచుకునే వాళ్లు టి20 లో టీమిండియాకు అవసరమని ఎక్స్పర్ట్ సైతం అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ కు అదే ప్రశ్న ఎదురయింది. మెగా ఈవెంట్ ఈవెంట్లో విరాట్ తో బౌలింగ్ కూడా చేయిస్తారా? అనే ప్రశ్న విని హిట్ మ్యాన్ కాస్త ఫన్నీగా స్పందించాడు. తనతో పాటు కోహ్లీ కూడా వరల్డ్ కప్ లో బౌలింగ్ చేసే అవకాశం ఉందని నవ్వేశాడు.

Advertisement

అయితే 2011 వన్డే వరల్డ్ కప్ టీమ్ తో పోల్చకూడదన్నాడు. ఎవరేమి చేయగలరో అదే చేస్తాడన్నారు. బ్యాట్ తో పాటు బాల్ తో రాణించే ప్లేయర్లకు అవకాశం ఇస్తున్నామన్నారు. బ్యాటింగ్ కే పరిమితమైన ప్లేయర్లు రాత్రికి రాత్రే బౌలింగ్ లో మెరుగైన ప్రదర్శన చేయలేరు కదా అన్నారు. బ్యాటర్స్ పరుగులు చేయడం మీదే దృష్టి పెడతారని అన్నారు. బ్యాట్ తో పరుగులు సాధిస్తారు కాబట్టి జట్టులో ఉన్నారని చెప్పుకొచ్చారు. బౌలింగ్ కు సంబంధించి రోహిత్ శర్మ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి 

బాయ్‌ ఫ్రెండ్‌ ను పరిచయం చేసిన సమంత..త్వరలోనే రెండో పెళ్లి ?

బాలకృష్ణ రవితేజ మధ్య గొడవేంటి..? బాలయ్య నిజంగానే కొట్టాడా..?

రాజకీయాల్లోకి అనసూయ ఎంట్రీ…సీఎం కేసీఆర్‌ క్రేజీ ఆఫర్‌ !

Visitors Are Also Reading