Home » రోహిత్‌ శర్మపై చాహాల్ ఫైర్…ఇకపై సూర్యుడిలా దూసుకోస్తా!

రోహిత్‌ శర్మపై చాహాల్ ఫైర్…ఇకపై సూర్యుడిలా దూసుకోస్తా!

by Bunty
Ad

 

ఆగష్టు 30 నుండి ప్రారంభమయ్యే ఆసియా కప్ లో బీసీసీఐ టీమిండియాను సెలెక్ట్ చేసింది. 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. కానీ అందులో సీనియర్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహాల్ కు చోటు దక్కలేదు. ఇటీవల ఐపిఎల్ లో అలాగే విండీస్ పర్యటనలో చాహల్ అద్భుతంగా ఆడాడు. కానీ అతన్ని సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. జడేజా, కుల్దీప్, అక్షర పటేల్ ను సెలెక్ట్ చేసిన సెలెక్టర్లు చాహల్ కు మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు.

Advertisement

దీనిపై చాహల్ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యాడు. రోహిత్‌ శర్మ, బీసీసీఐకి కౌంటర్‌ ఇచ్చేలా అతను పెట్టిన ఎమోజీలు వైరల్ గా మారాయి. ట్విట్టర్ లో తన బాధను పంచుకుంటూ… పోస్టును పెట్టాడు. మొదటి ఎమోజీలో మబ్బుల చాటున ఉన్న సూర్యుడు ఉండగా… తర్వాత మబ్బులు తొలగి మెరుస్తున్న సూర్యుడు పోస్ట్ పెట్టాడు. 2019 వరల్డ్ కప్ తర్వాత చాహల్ వన్డేల్లో రాణిస్తున్నాడు. వరల్డ్ కప్ తర్వాత 23 మ్యాచ్లు ఆడిన చాహల్ 37 వికెట్లు తీశాడు. అతను ఫామ్ లో ఉన్నప్పటికీ ఆసియా కప్ టోర్నీకి అతన్ని సెలెక్ట్ చేయకపోవడంపై అతని ఫ్యాన్స్ తో పాటు మిగతావారు కూడా ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

ఇక అతన్ని తప్పించడంపై సెలెక్టర్ అగర్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. జట్టులో ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లు సెలెక్ట్ అయ్యారు. జడేజ, కుల్దీప్, అక్షర్ పటేల్. వీరిలో కుల్దీప్ బౌలింగ్ మాత్రమే చేస్తాడు. కానీ జడేజా, అక్షర్ పటేల్ బ్యాటింగ్ కూడా చేయగలరు. అందుకే వారిని తీసుకున్నామని చెప్పారు. అక్షర్ పటేల్ ఇటీవల బాగా ఆడుతున్నాడని, జట్టుకు బ్యాటింగ్ లో ఉపయోగపడతాడని, అందు కే ఆసియా కప్ కు తీసుకున్నామని చెప్పారు. చాహల్ నీ అవసరమైతే వన్డే వరల్డ్ కప్ లో తీసుకుంటామని తెలిపారు.

ఇవి కూడా చదవండి 

రాజకీయాల్లోకి అనసూయ ఎంట్రీ…సీఎం కేసీఆర్‌ క్రేజీ ఆఫర్‌ !

NTR : ఎన్టీఆర్ చనిపోయే గంట ముందు ఇంత కథ జరిగిందా !!

బాలకృష్ణ రవితేజ మధ్య గొడవేంటి..? బాలయ్య నిజంగానే కొట్టాడా..?

Visitors Are Also Reading