భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రపంచ కప్ కురుక్షేత్రం మొదలవుతుంది. 46 రోజులు పాటు సాగే ఈ మహాసంగ్రామంలో జట్లు అమీ తుమీ తేల్చుకొనున్నాయి. ఈసారి టైటిల్ రేసులో భారత్, పాకిస్తాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. ప్రపంచ కప్ షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. భద్రతా కారణాల రిత్య ఇప్పటికే 9 మ్యాచ్లను ఐసీసీఐ రీ షెడ్యూల్ చేసింది. మళ్లీ షెడ్యూల్ లో మార్పులు చేయాలంటూ రాష్ట్ర క్రికెట్ సంఘాలు బీసీసీఐకి లేఖలు పంపుతున్నాయి.
Advertisement
ఉప్పల్ వేదికగా జరగనున్న పాక్ – శ్రీలంక మ్యాచ్ షెడ్యూల్ ను మార్చాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ నీ అభ్యర్థించింది. హైదరాబాదులో అక్టోబర్ 6న పాకిస్తాన్/నెదర్లాండ్స్, అక్టోబర్ 9న న్యూజిలాండ్/నెదర్లాండ్స్, అక్టోబర్ 10 న పాకిస్తాన్/శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇంత తక్కువ వ్యవధిలో మూడు మ్యాచ్లను నిర్వహించడం మరియు వరుసగా రెండు రోజుల్లో రెండు మ్యాచ్లు నిర్వహించడం కష్టమవుతుందంటూ బీసీసీఐకి హెచ్సీఏ లేఖ రాసింది. నిజానికి పాకేస్తాన్ హైదరాబాదులో మ్యాచ్ ఆడుతుంది అంటే భద్రతా విషయంలో పోలీసులు ఏమాత్రం రాజీపడరు.
Advertisement
ఏ చిన్న సమస్య వచ్చినా అది నగర ప్రతిష్టను దెబ్బతీస్తుంది. దీంతో వరుసగా మ్యాచ్లకు భద్రత ఇవ్వడం కాస్త కష్టమే. ఇదే విషయాన్ని పోలీసులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి విజ్ఞప్తి చేశారు. దీంతో హెచ్సిఏ… బిసిసిఐకి రాసిన లేఖలు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అసలు ఐసీసీఐ తోలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ల మధ్య గ్యాప్ సరిపడా ఉంది. షెడ్యూల్ మార్చిన తర్వాత భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఒకరోజు ముందుకు జరిపారు. దీంతోనే అసలు సమస్య తలెత్తింది. మరి షెడ్యూల్ మళ్లీ మారుస్తారా లేక ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం మ్యాచును నిర్వహిస్తారా చూడాలి.
ఇవి కూడా చదవండి
Asia Cup 2023 : టీమ్ ఇండియా ప్రకటన.. తిలక్ ఎంట్రీ.. వైస్ కెప్టెన్ గా హర్దిక్..!
భార్య ప్రణతికి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్…!
Virat Kohli : క్రికెట్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ?