ఆరోగ్యానికి మేలు చూసే ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. చాలా మంది రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమందికి రాత్రిపూట సరిగా నిద్ర కూడా పట్టదు. మీకు కూడా రాత్రిళ్ళు సరిగా నిద్ర పొవట్లేదా..? అయితే ఇలా చేయండి ఇలా చేయడం వలన సులభంగా నిద్ర పడుతుంది. పైగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు.
Advertisement
ఆరోగ్యానికి గసగసాలు చాలా మేలు చేస్తాయి. గసగసాలుని అందుకే చాలామంది తీసుకుంటూ ఉంటారు. నిద్రలేమి సమస్యకి ఇది గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. మంచి పరిమళంతో ఉంటాయి ఇవి. గసగసాలు కి ఆయుర్వేదంలో కూడా ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. దివ్య ఔషధంలా ఇది పనిచేస్తుంది. చాలా రోగాల నుండి మనల్ని దూరం చేస్తాయి. నీళ్ల విరోచనాలు అవుతున్నప్పుడు గసగసాలు పంచదార కలిపి తీసుకుంటే విరోచనాలు వెంటనే తగ్గుతాయి.
Advertisement
గసగసాలు వలన కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడవు. గసగసాలలో పీచు ఎక్కువ. పేగులు బాగా కదిలేలా గసగసాలు చేస్తాయి. అజీర్తి సమస్యల నుండి కూడా దూరంగా ఉంచగలదు. గుండె సమస్య ఉన్న వాళ్లు గసగసాలు తీసుకుంటే మంచిది. నిద్ర పట్టకపోతే రోజు నిద్రపోయే ముందు వేడి పాలల్లో కొంచెం గసగసాల పేస్టు వేసుకుని తాగినట్లయితే మంచి నిద్ర కలుగుతుంది వేడి కూడా తగ్గిపోతుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. రాత్రులు సరిగా నిద్ర పట్టకపోయినట్లయితే ఈ విధంగా ట్రై చేయండి. బాగా నిద్రపోవచ్చు. ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
Also read:
- భర్త సంపాదన మీద.. భార్యకి ఎలాంటి హక్కు ఉంటుంది..?
- ఇంట్లో ఈ దిశలో కలశం పెట్టండి.. ఇక ఆ బాధలేమి వుండవు..!
- ఫోన్ పౌచ్ లో డబ్బులు పెడుతున్నారా..? ఈ అలవాటు మానుకోండి.. ఎందుకంటే..?