Mr Pregnant Review : డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ లో యంగ్ హీరో సోహైల్ కు జోడిగా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ఫేమ్ రూపా కొడవయూర్ నటించింది. ఈ మూవీని మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల, వెంకట అన్నపరెడ్డి నిర్మించారు. శ్రీనివాస్ విజనంపాటి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఇవాళ విడుదల అయింది. మరి సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Advertisement
కథ మరియు వివరణ :
గౌతమ్ (సోహెల్) ఓ అనాధ. టాటూలు వేసుకుంటూ బతికేస్తుంటాడు. టాటూ కాంపిటేషన్ లోను విన్ అవుతుంటాడు. గౌతమ్ ను చదువుకునే రోజులనాటి నుంచి మహి (రూప) ప్రేమిస్తూనే ఉంటుంది. కానీ గౌతమ్ మాత్రం ఆ ప్రేమను అంగీకరించడు. ఇక మహి ప్రేమను భరించలేక ఓ కండిషన్ పెడతాడు. పెళ్లి చేసుకోవాలంటే పిల్లల్ని కనకూడదు అనే నిబంధన పెడతాడు. పిల్లలు అంటే ఎంతో ఇష్టం ఉన్న మహి ఆ కండిషన్ కి సైతం ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఆ పేరెంట్స్ ను ఎదురించి మరి గౌతమ్ ను పెళ్లి చేసుకుంటుంది మహి. పెళ్లి తర్వాత మహి గౌతమ్ లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? పిల్లలు వద్దనుకున్న గౌతమ్ కు మహీ ప్రెగ్నెంట్ అని తెలుసా ఏం జరిగింది? అసలు పిల్లలు వద్దని గౌతమ్ ఎందుకు అంటాడు? గౌతమ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? మహికి బదులు గౌతమ్ ఎందుకు గర్భాన్ని దాల్చవలసి వస్తుంది? చివరకు డెలివరీ సక్సెస్ అయ్యిందా? లేదా? అన్నది కథ.
Advertisement
గౌతమ్ పాత్రలో సోహైల్ జీవించాడు. ఎమోషనల్ సీన్లలో మంచి నటన కనబరిచారు. ఫ్రీ క్లైమాక్స్ లో వైవా హర్షతో వచ్చే సీన్ క్లైమాక్స్ లో కన్నీళ్లు పెట్టిస్తారు. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’లో మెప్పించిన రూపా కొడవయూర్ కు మరోసారి నటనకు స్కోప్ ఉన్న పాత్ర లభించింది. మహి పాత్రలో లవ్ సీన్లలోను, భావోద్వేగ సన్నివేశాల్లోనూ ఆకట్టుకుంటుంది. వైవా హర్షకు సోహైల్ ఫ్రెండ్ గా సినిమా మొత్తం కనిపించే పాత్ర లభించింది. హర్ష కూడా బాగా నటించారు. బ్రహ్మాజీ, అభిషేక్ లు బాగా నవ్విస్తారు. డాక్టర్ వసుదగా సుహాసినికి మంచి పాత్ర లభించింది. మిగిలిన పాత్రధారులు అందరూ వారి పాత్రలకు తగిన న్యాయం చేశారు.
ప్లస్ పాయింట్స్ :
కథ
సెంటిమెంట్
హీరో సోహైల్
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
సాగదీత
రేటింగ్ : 2.5/5
ఇవి కూడా చదవండి
Nara Lokesh : బ్రాహ్మణితో లోకేష్ ప్రేమాయణం.. బాలయ్యకు భయపడి పాపం ?
హీరోయిన్ రాశి ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!