జైలర్ సినిమా ఆగష్టు పదవ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్ పోషించగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణన్, మర్నామీనన్, వసంత్ రవి, విజయకన్, వీటీవీ గణేష్, యోగి బాబు, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ మరియు జాకీ శ్రాఫ్ లు కీలక పాత్రలు పోషించారు. అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.
Advertisement
సాధారణంగా స్టార్ హీరోలు ఉన్న సినిమాలలో ఒక విలన్ కి పేరు రావాలి అంటే అది చాలా కష్టం. అయితే.. రజిని లాంటి స్టార్ ఉన్న సినిమాలో నటించిన ఓ విలన్ కి ఇప్పుడు మంచి పేరు వచ్చింది. అయితే దాని వెనుక ఆయన ఎంత కష్టపడ్డారో మనం ఊహించవచ్చు. ఇంతకీ ఆ విలన్ ఎవరు, ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సినిమాలో సుత్తితో మొహం పగలగొట్టి చంపేసి.. కళ్ళతోనే ఆడియన్స్ ని కూడా భయపెట్టేసిన దేశవాళీ విలన్ అసలు పేరు వినాయకన్. ఈ విలన్ తమిళ ఆడియన్స్ కె కాదు తెలుగు ఆడియన్స్ కి కూడా సుపరిచితుడే. ఎక్కడో చూసామే అని అనిపిస్తోంది కదా. అది నిజమే. కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన “అసాధ్యుడు” సినిమాలో వినాయకన్ విలన్ గా నటించారు.
Advertisement
ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు. గాయకుడూ, స్వర కర్త, నాట్యాచారుడు కూడా. 1995 లో ‘మాంత్రికం’ లో గెస్ట్ రోల్ తో నటనారంగంలో తన జీవితాన్ని ప్రారంభించారు. మరో రెండు సినిమాల్లో సహాయక పాత్ర, కమెడియన్ రోల్స్ లో కూడా నటించారు. ఆ తరువాత ‘స్టాప్ వయొలెన్స్’, ‘ఛోటా ముంబాయి’ సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఆయన మొత్తంగా 53 మలయాళ సినిమాలు, 8 తమిళ సినిమాలు, ఒక తెలుగు సినిమా, ఒక హిందీ సినిమాలో నటించారు. సినిమాల్లోకి రాక ముందు ఆయన ‘బ్లాక్ మెర్క్యురీ’ అనే డాన్స్ గ్రూపుని రన్ చేసేవారు. మైకేల్ జాక్సన్ ని ఇమిటేట్ చేసి లోకల్ గా పాపులర్ అయిన వినాయకన్ స్వయంకృషితో సినిమాల్లో కూడా రాణించారు. ఈయనకు 2016 సంవత్సరంలో ‘కమ్మటి పాదం’ సినిమాలో తన నటనకు కేరళ ప్రభుత్వం ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడి అవార్డు లభించింది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
రాత్రిపూట మృతదేహాన్ని ఒంటరిగా ఉంచకూడదు ఎందుకో తెలుసా..?
అధికమాస అమావాస్య నాడు ఈ తప్పులు ఎట్టి పరిస్థితిలో చేయకండి..! శివుని ఆగ్రహానికి లోనవుతారు..!
Chanikya niti : విజయవంతమైన వ్యాపారవేత్త కావాలంటే ఈ లక్షణాలు మీలో కచ్చితంగా ఉండాలి..!