చాణక్యుడి గురించి నేటి తరానికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తరతరాలుగా ఆయన రచించిన అర్ధశాస్త్రంలోని మెళకువలను నేటికీ మనం నేర్చుకుంటున్నాం. కేవలం అర్ధ శాస్త్రం మాత్రమే కాదు బ్రతకడానికి అవసరమైన ఎన్నో జీవిత సత్యాలను కూడా చాణుక్యుడు వివరించాడు. చాణుక్యుడు చెప్పిన నీతి వాక్యాలన్నీ ప్రస్తుతం చాణక్య నీతి అన్న గ్రంధం ద్వారా నేటి తరానికి చేరుతున్నాయి. అయితే చాణుక్యుడు ప్రతి మనిషి తమ జీవితంలో కొన్ని విషయాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాడు. అవేంటో మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. జీవితంలో ముందుకు వెళ్లాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే అందుకోసం ముందుగా చేయాల్సింది మంచి చెప్పే వారి విషయాలను వినడం. చాణుక్యుడు చెప్పినట్లు జీవితంలో పైకి రావాలంటే ఎటువంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Advertisement
చదువుకున్న వ్యక్తికి ప్రతిచోటా గౌరవం ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. విద్య సంస్కారాన్ని నేర్పిస్తుంది. ఒక వ్యక్తి శారీరకంగా బలహీనంగా ఉన్నా, అతని మేధస్సు పదునైనదై ఉండవచ్చు. ఆ తెలివితేటలు వారికి స్వంతంగా డబ్బు సంపాదించుకోవడానికి దోహదం చేస్తాయి. అందుకే ఎక్కడకు వెళ్లినా విద్యావంతులతో స్నేహం చేయాలి. ఇతరుల తప్పుల నుంచి పాఠం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో మిమ్మల్ని మీరు మూడు ప్రశ్నలు వేసుకోవాలి. ఎందుకు ఈ పని చేయాలి? దీని ఫలితం ఎలా ఉంటుంది? నేను ఇందులో సక్సెస్ అవ్వగలనా? అన్న ప్రశ్నలకు మనసులో సమాధానం చెప్పుకోగలగాలి.
అప్పుని శత్రువుగా చూడాలి. అప్పుని తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అటువంటి పరిస్థితులకు దూరంగా ఉండాలి. ఇంకా, ప్రాక్టికల్గా జరిగే అనుభవాల ద్వారా వచ్చే పాఠాలను కచ్చితంగా నేర్చుకోవాలి. చాణుక్యుడు చెప్పిన ఈ విషయాలను గుర్తుంచుకుని, ప్రతి ఒక్కరు తమ నిజ జీవితంలో పాటించగలిగితే.. వారు కచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతారు.
మరిన్ని..
Yawning : అదేపనిగా ఆవలింతలు రావడం అనారోగ్యానికి సంకేతమా..! నిపుణులు ఏమంటున్నారంటే..?
షారుఖ్ సినిమాలో సౌత్ స్టార్ హీరో.. జవాన్ ట్రైలర్‌తో సస్పెన్స్..!
సింహాద్రి మూవీ హీరోయిన్ అంకిత ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా ?