Home » ఇంట్లో హనుమాన్ ఫోటో ని పెట్టుకోవాలంటే.. వీటిని తప్పక పాటించాలి..!

ఇంట్లో హనుమాన్ ఫోటో ని పెట్టుకోవాలంటే.. వీటిని తప్పక పాటించాలి..!

by Sravya
Ad

చాలామంది ఇళ్లల్లో హనుమంతుడు ఫోటోలు ఉంటాయి. హనుమంతుడు ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటే హనుమంతుడు ఆశీస్సులు కలుగుతాయి. వాస్తు ప్రకారం హనుమంతుడి ఫోటోని పెట్టేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని కచ్చితంగా పాటించాలి. వాస్తు ప్రకారం హనుమంతుడి ఫోటోని దక్షిణ వైపు పెడితే మంచిది. కూర్చుని ఎరుపు రంగులో ఉండే ఫోటోని ఇలా దక్షిణ వైపు పెడితే చాలా మంచిది. ఇలా ఉండడం వలన హనుమంతుడు యొక్క ప్రభావం మన మీద పడుతుందట. ఐశ్వర్య ఆనందం కలుగుతాయి.

Advertisement

Advertisement

ఉత్తర ముఖి హనుమంతుని రూపంలో ఉండే హనుమంతుడిని మనం ఉత్తరం వైపు పెట్టుకోవాలి. పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని మనం ఇంట్లో పెట్టుకోవడం వలన సంపద బాగా పెరుగుతుంది. ఆటంకాలు కానీ వ్యాధులు కానీ రావు. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పంచముఖి ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టుకోవడం మంచిది. శ్రీరాముడికి నమస్కరిస్తూ ఉన్న హనుమంతుడి ఫోటోని ఇంట్లో పెట్టుకుంటే కష్టాలు పోతాయి. తెల్లని రంగులో ఉన్న హనుమంతుడిని పెట్టుకుంటే ప్రమోషన్ త్వరగా వస్తుంది. కోరికలు నెరవేరాలంటే ధ్యానం చేస్తున్న హనుమంతుడి ఫోటోని ఇంట్లో పెట్టుకోండి.

Also read:

Visitors Are Also Reading