Home » Eating on bed : మంచం మీద కూర్చొని భోజనం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

Eating on bed : మంచం మీద కూర్చొని భోజనం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

by Mounika
Ad

 Eating on bed : ప్రస్తుత ప్రజలు మారుతున్న కాలాన్ని బట్టి హడావిడి జీవితం గడుపుతున్నారు. ఇప్పటి పరిస్థితుల బట్టి  ప్రతి ఒక్కరిది కూడా ఉరుకుల పరుగుల జీవితమనే చెప్పుకోవచ్చు.  ఎందుకంటే భోజనం తీసుకునే  సమయాన్ని కూడా కాలానికి సంబంధం లేకుండా చేసే పరిస్థితులు ఏర్పడాయి.  మనం ఏం తింటున్నాం.. తినేటప్పుడు ఎలాంటి పద్ధతులను అవలంబించాలనే విషయంలో చాలామంది  కొన్ని తప్పులు తెలియకుండానే చేసేస్తున్నారు.

Food eating on bed

Advertisement

అయితే భోజనం చేసేటప్పుడు మాత్రం కచ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి. లేకపోతే అనవసరంగా చిక్కులు కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాము. మనలో చాలామంది హడావిడిగా కొన్ని సార్లు మంచం మీద కూర్చుని  భోజనం చేస్తూ ఉంటారు. ఇలా మంచం మీద కూర్చుని భోజనం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ..

 మంచం మీద కూర్చుని భోజనం చేయడం వలన భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తద్వారా  కుటుంబంలో మనశ్శాంతి దూరమైపోతుంది. అలాగే కుటుంబంలో అభివృద్ధి కూడా నాశనం అవుతుంది.   రాత్రి పడుకున్న తర్వాత, ఉదయం లేచినప్పుడు, మంచం సరిగ్గా ఉంచాలి.  మంచం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచడం ద్వారా దేవుడు సంతోషిస్తాడు.  శాస్త్రాల ప్రకారం, అలా మంచం మీద కూర్చుని తినేవారికి   ఇంట్లో డబ్బు లేకపోవడం మరియు ఆర్థిక పరిస్థితి క్షీణించడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా మంచం మీద భోజనం చేయడం వలన క్రిములు చేరి చర్మ సమస్యల వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తాయి

Advertisement

traditional food eating

కాబట్టి భోజనం చేసేటప్పుడు పద్ధతిగా నేలపై కూర్చొని  ముందు భగవంతుడిని ప్రార్థించాలి. ఎందుకంటే మన దేహమే దేవాలయం, మన ఆత్మ భగత్ స్వరూపం అని పురాణాల్లో వెల్లడించడం  జరిగింది. మన దేహానికి శాంతి చేకూరడానికి తినేటప్పుడు క‌చ్చితంగా ఒక పద్ధతిలో భోజనం చేయాలి. మన ఐదు వేళ్ళు స్పర్శ తీసుకొనే ఆహారానికి తగిలినప్పుడు జీవశక్తిని ఉత్తేజపరుస్తుంది. అందువలన ఎప్పుడు కూడా ఆహారాన్ని మంచం పైన కూర్చొని  తినకూడదు. తినే భోజనాన్ని గౌరవించడం అనేది ప్రతి ఒక్కరికి ఉత్తమమైన పద్ధతి అని మన పురాణా కాలం నుంచి మన పెద్దలు  వెల్లడించడం జరుగుతుంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

Vastu tips : ఉద్యోగంలో పురోగతి కావాలంటే ఈ రోజు నుంచే ఈ 5 సులభమైన మార్గాలను అవలంబించండి.

Chanakya Niti : నిజమైన స్నేహితుడిని ఇలా గుర్తించండి.. మీరు ఎప్పటికీ మోసపోరు..!

ఆడవాళ్ళూ.. నైటీలు వేసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

Visitors Are Also Reading