2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ఆ తర్వాత మళ్లీ కప్ ను గెలుచుకోలేదు. ఆ తర్వాత జరిగిన రెండు వరల్డ్ కప్స్ లో కనీసం ఫైనల్స్ కూడా చేరుకోలేదు. ఇక ఈ ఏడాది ఇండియాలోనే వరల్డ్ కప్ జరుగుతుంది. అందుకే టీమిండియాకు సవాల్ గా మారింది. ఈసారి కప్ కొట్టకపోతే ఫ్యాన్స్ నుంచి మాజీల నుంచి ఎక్కువ విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకే వరల్డ్ కప్ కు సెలక్ట్ చేసే జట్టు కూడా చాలా కీలకం. జట్టుకు అవసరమయ్యే ప్లేయర్స్ ను మాత్రమే బీసీసీఐ సెలెక్ట్ చేయాలి.
Advertisement
ఇక టీమ్ ఇండియాను కలవర పెడుతున్న అంశం మిడిలార్డర్. 5వ స్థానంలో ఎవరిని దింపాలని బీసీసీఐ నానా తంటాలు పడుతుంది. శ్రేయస్ అయ్యర్ దూరమయ్యాక ఈ ప్లేస్ లో కరెక్ట్ ఆటగాడు సెట్ కాలేదు. ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ కు ఛాన్స్ ఇచ్చారు. కానీ అతను వన్డేల్లో విఫలమయ్యారు. రీసెంట్ గా జరిగిన వన్డే సిరీస్ లో కూడా అతను రానించలేదు. కాబట్టి వన్డే వరల్డ్ కప్కు సెలెక్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇక మిడిలార్డర్ ఈ ప్లేస్ కోసం ఎక్కువ పోటీ పడుతున్న ఆటగాడు సంజు శాంసన్. ఎంతో ప్రతిభ ఉన్న ఈ ప్లేయర్ కు సరిగ్గా అవకాశాలు రావడం లేదు.
Advertisement
విండీస్ తో వన్డే సిరీస్ లో ఆఖరి రెండు మ్యాచుల్లో స్థానం దక్కింది. మొదటి వన్డేలో నిరాశపరిచిన సంజు కీలకమైన ఆఖరి వన్డేలో సత్తా చాటాడు. మొదటి బంతి నుండి అటాకింగ్ కు మారిన సంజు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఇక మాజీలు కూడా సూర్య కన్నా సంజు కి వరల్డ్ కప్ లో ఛాన్స్ ఇవ్వాలని సలహా ఇస్తున్నారు. వన్డేల్లో అతను ఆడిన మ్యాచుల్లో సూర్య కన్నా సంజు వన్డేల్లో మంచిగా రాణిస్తున్నాడు. కీపింగ్ చేయడం కూడా సంజుకి కలిసి వచ్చే అంశం. ఈ ఇద్దరి మధ్య వరల్డ్ కప్ కోసం గట్టి పోటీ ఉంది. ఇక బిసిసిఐ వీరి ఇద్దరిలో ఎవరికి ఓటు వేస్తుందో చూడాలి. అక్టోబర్లో వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో సెప్టెంబర్ లో జట్టును ప్రకటించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టిన సినిమాలు…!
వెస్టిండీస్‌తో ఓటమి.. కన్నీరు పెట్టుకున్న హార్దిక్!
RCB : ఆర్‌సీబీకి కొత్త కోచ్.. వారిద్దరిపై వేటు..ఇక కప్ నమ్ దే