Home » సానియా మీర్జా- షోయాబ్ మాలిక్‌ విడాకులు..!

సానియా మీర్జా- షోయాబ్ మాలిక్‌ విడాకులు..!

by Bunty
Ad

స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత తరఫున టెన్నిస్ ప్లేయర్గా క్రీడారంగంలోకి అడుగుపెట్టిన సానియా మీర్జా… ఇండియాకు అనేక పతకాలను తీసుకువచ్చింది. హైదరాబాద్కు చెందిన సానియా మీర్జా… ఇండియాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావడమే కాకుండా… పాకిస్తాన్ కు చెందిన మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను  పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వివాహం 2010 సంవత్సరంలో హైదరాబాద్లో జరిగింది. ఇక ఈ జంటకు 2018లో ఓ కుమారుడు కూడా జన్మించాడు.

Advertisement

ఇది ఇలా ఉండగా గత ఆరు నెలలుగా… పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరియు సానియా మీర్జా విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి ఓ అమ్మాయి కారణమని కూడా కొంతమంది ప్రచారం చేశారు. ఓ మోడల్ తో షోయబ్ మాలిక్ సంబంధం పెట్టుకున్నాడని… ఆ విషయం సానియా మీర్జాకు తెలియడంతో… విడాకులకు సిద్ధమైందని ఈ జంటపై ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఈ జంట స్పందించలేదు.

Advertisement

ఇలాంటి తరుణంలోనే తాజాగా మరోసారి ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి కారణం తాజాగా షోయబ్ మాలిక్ సోషల్ మీడియాలో తన బయోను మార్చేయడమే. గతంలో… “అథ్లెట్, సూపర్ ఉమెన్ సానియా మీర్జాకు భర్త, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రిని” అని సోయబ్ మాలిక్ బయోలో ఉండేది. అయితే ఇప్పుడు దానిని షోయబ్ మాలిక్ మార్చేశాడు. కేవలం “ఒక బిడ్డకు తండ్రి” అన్న పదాన్ని మాత్రమే తన బయోలో ఉంచాడు. దీంతో మరోసారి సానియా మీర్జా మరియు షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో ఏ మేరకు వాస్తవం ఉన్నదో త్వరలోనే తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఏడాదిగా క్రికెటర్ స్మృతి మందాన సీక్రెట్ డేటింగ్..?

Rashmika Mandanna : అతనితో నాకు పెళ్లైంది..అందరికి షాకిచ్చిన రష్మిక మందన్న !

టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఆసియాకప్‌కు ప్లేయర్లు దూరం!

Visitors Are Also Reading