టాలీవుడ్ హీరో నాగచైతన్య హీరోయిన్ సమంత విడాకుల వార్త ఎంతోమందిని బాధించింది. ముఖ్యంగా వీరిద్దరి అభిమానులు ఇప్పటికీ సమంత చైతు మళ్ళీ కలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఇద్దరూ విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన నాటి నుండి విడాకులకు సంబంధించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. దాంతో వీరి విడాకుల విషయం ఇంకా హాట్ టాపిక్ గానే కొనసాగుతోంది. ఇక సమంత ప్రస్తుతం సినిమాల్లో బిజీ అయినప్పటికీ ఇంటర్వ్యూలలో మరియు సోషల్ మీడియాలో ఇన్ డైరెక్ట్ గా విడాకులకు సంబంధించిన అంశం పై కామెంట్లు చేస్తూనే ఉంది.
అయితే నాగచైతన్య మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమంత తో విడాకుల అంశంపై స్పందించలేదు. కాగా తాజాగా నాగచైతన్య ఓ ఇంటర్వ్యూ లో సమంతతో విడాకుల అంశంపై స్పందించారు. మీడియా ప్రతినిధి మీరు సమంత తో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అని ప్రశ్నించగా ….అది ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయం అంటూ నా చైతన్య సమాధానమిచ్చారు. ఆమె సంతోషంగా ఉంది, నేను కూడా సంతోషంగా ఉన్నాను. ఈ పరిస్థితుల్లో ఇద్దరికీ ఇదే మంచి నిర్ణయం అంటూ ఆయన తెలిపారు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
Advertisement
ఇది ఇలా ఉంటే విడాకులకు కారణం సమంత అని చైతూ అభిమానులు ఆరోపిస్తున్నారు. సమంత కొన్ని సినిమాలు చేయడం ఆ సినిమాలలోని క్యారెక్టర్లు నాగచైతన్యకు నచ్చక పోవడం వల్ల ఇద్దరు విడిపోవాల్సి వచ్చిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు సమంత అభిమానులు ఇద్దరూ విడిపోవడానికి కారణం చైతునే అని చైతూకి మరో హీరోయిన్ తో సంబంధం ఉండటం వల్లే ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది అని అరోపిస్తున్నారు. ఇక ఏది ఏమైనా వీరి విడాకుల అంశం ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది.