ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అనేక వ్యాధులు ప్రజలను వెంటాడుతున్నాయి. మారుతున్న జీవనశైలి బట్టి అధిక బరువు సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. ఈ అధిక బరువు కారణంగా చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు అల్లుకుంటున్నాయి. కేవలం పాతికేళ్ల వయసుకే ఈ 40 ఏళ్లు దాటిన వారిలా కనిపిస్తున్నారు. మరి ఇలాంటి సమస్యల నుంచి బయట పడాలి అంటే ప్రకృతి మనకి ఎన్నో అద్భుతమైన వనమూలికలను ప్రసాదించింది. వాటిలో శంఖుపూలతో పువ్వులు కూడా ఒకటి.
Advertisement
ఈ పూలను మనం ఎక్కువగా శివుడి ఆరాధన కోసం ఉపయోగిస్తూ ఉంటాం. కానీ దీనితో తయారు చేసే టీ వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చాలామందికి తెలియదు. ఈ శంఖుపూలతో తయారు చేసే టీనే బ్లూ టీ అని అంటారు. ఈ బ్లూ టీని ఎలా తయారు చేసుకోవాలి దాని వలన కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ప్రతిరోజు బ్లూ టీని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ టీ కోసం శంఖుపూలతో తయారుచేస్తారు. ఈ బ్లూ టీకి కోసం 1 1/4 కప్పు నీరు స్టవ్ పై పెట్టి మరుగుతున్న సమయంలో 6 శంఖు పువ్వులు, 1 అంగుళం అల్లం చిన్న చిన్నగా చేసుకున్న ముక్కలను వేసి బాగా మరిగించాలి. కొంచెం వేడి తగ్గిన తర్వాత 1 టీస్పూన్ తేనె,1 టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి.
ఇలా తయారైన టీని రోజు తీసుకోవడం వలన అధిక బరువు నియంత్రణలోకి రావడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలోను, చర్మం, జుట్టును అందంగా మార్చడంలో సహాయపడుతుంది. ఈ బ్లూ టీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఆందోళన, డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో ఈ టీ సహాయపడుతుంది. అంతేకాకుండా బ్లూ టీని ప్రతిరోజు తాగడం వలన Curfew నిరోధక శక్తి పెరిగి అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుతుంది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు :
Health tips : చాతిలో మంటను క్షణాల్లో తగ్గించే బెస్ట్ రెమెడీ ఇది..!
ఫుడ్ కోర్ట్స్ ఎప్పుడు టాప్ ఫ్లోర్ లోనే ఎందుకు ఉంటాయో తెలుసా? అసలు కారణం ఇదే!