కరోనా కలకలం మళ్ళీ మొదలైంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు మహమ్మారి బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు కరోనాతో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆంధ్ర ప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కరోనా బారినపడ్డారు.
Advertisement
Advertisement
దాంతో ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు కూడా కరోనా వచ్చింది. దాంతో ప్రస్తుతం ఆయన కూడా ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 9న కంచికచర్ల లో వంగవీటి రంగా విగ్రహావిష్కరణకు రాధా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.