సావిత్రి ఈ పేరు తెలియని తెలుగువారు అంటూ ఎవరు ఉండరు. సావిత్రి తెలుగు వారి నట సంపద అని ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీ ఆమెను కీర్తిస్తూనే ఉంటుంది. ఆమె నటనతో అభినయంతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. సినిమా రంగంలో ఎంత అగ్రస్థాయి నటిగా ఎదిగి తరతరాలకు తన పేరును గుర్తుండిపోయేలా చేసింది. స్టార్ హీరోయిన్ గా ఉన్న స్థాయిలను చూసిన సావిత్రి తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చివరి క్షణాల్లో దుర్భర స్థితిలో 46 ఏళ్ల అతి చిన్న వయసులోనే మరణించారు.
Advertisement
మహానటి చిత్రంతో ఆమె గొప్పతనం ఏంటో ఈ తరానికి కూడా తెలియజేశారు. ఆమె మరణించి ఎన్నో ఏళ్లు గడుస్తున్నా ఆమె జీవితంలో జరిగిన ఎన్నో విషయాలు ఇప్పటికి కూడా అనేకమంది చర్చిస్తూనే ఉంటారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సీనియర్ సినీ జర్నలిస్టులు అప్పట్లో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెర మీదకు తెచ్చారు.
1953 లో అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి జంటగా నటించిన దేవదాసు సినిమా అప్పటిలో ఘనవిజయాన్ని సాధించింది. ఈ చిత్రంతో సావిత్రికి సినీ అభిమానుల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా ఏఎన్ఆర్, సావిత్రి కాంబినేషన్లో వచ్చిన మూగమనసులు, సుమంగళి, అర్ధాంగి, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి వంటి సినిమాలు కూడా సూపర్ సక్సెస్ సాధించాయి.
Advertisement
వీరిద్దరి మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అప్పట్లో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవి. ఆ నేపథ్యంలోనే ఏఎన్ఆర్ సావిత్రితో గాఢమైన ప్రేమలో మునిగి తేలుతున్నారని బాగా ప్రచారం జరిగేది. ఏఎన్ఆర్‌కి సావిత్రి అంటే చచ్చేంత ఇష్టమని, పెళ్లి చేసుకోవాలని ఎంత అడిగినా ఆమె ఒప్పుకోలేదని వార్తలు హల్చల్ చేసేవి. ఇక వీరిపై వస్తున్న వార్తలకు విసిగిపోయిన సావిత్రి మా ఇద్దరి మధ్య స్నేహబంధం తప్ప ఎలాంటి సంబంధమూ లేదు. నాకు ఏఎన్ఆర్ కి మధ్య సంబంధం ఉందని వస్తున్న ప్రచారాలు అవాస్తవం. ఇప్పటికీ కూడా నమ్మకపోతే అది వారి ఇష్టం అని క్లారిటీ ఇచ్చిందట సావిత్రి. సావిత్రి ఇచ్చిన స్టేట్మెంట్ గురించి తెలుసుకున్న ఏఎన్ఆర్ ఈ విషయంపై ఆమెను సరదాగా ఆటపటించేవారని సీనియర్ సినీ జర్నలిస్ట్ తెలియజేశారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
రజినీకాంత్ జైలర్ మూవీకి సెన్సార్ షాకింగ్ రిపోర్ట్..!
మగధీర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..?
అలియా భట్ కారణంగా సుధామూర్తి కన్నీళ్లు పెట్టుకున్నారా? అసలు కారణం ఏంటంటే?