Vastu tips : ప్రతి మనిషి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు. దీని కోసం ఒక వ్యక్తి పగలు, రాత్రి కష్టపడి డబ్బు సంపాదిస్తాడు. అయితే మీరు ఎంత డబ్బు సంపాదించినా ఆర్థికంగా చితికిపోతున్నారంటే, దీని వెనుక కారణం ఇంట్లో వాస్తు దోషం ఉండటం. ఎప్పుడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంటుందో మీరు ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు కూడా మీ చేతిలో నిలవదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూ అప్పుల ఊబిలోనికి తోసేస్తుంది. వాస్తు శాస్త్ర పండితుడు చెప్పిన విధంగా ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇంటిలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎలాంటి పరిష్కారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
వాస్తు దోషాలను తొలగించే పరిహారాలు :
#1. లక్షల రూపాయలు సంపాదించిన తర్వాత కూడా మీరు అప్పుల్లో ఉన్నట్లయితే, ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక్ గుర్తును తొమ్మిది వేళ్ల పొడవు మరియు తొమ్మిది వేళ్ల వెడల్పుతో పసుపుతో వేసి కుంకుమ బొట్లు పెట్టాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది.
Advertisement
#2. మీ ఇంట్లో వాస్తు దోషం ఉంటే, దాని వల్ల మీ ఇంటి పురోగతి దెబ్బతింటుంటే, ఇంటికి ఉత్తరం వైపున నీటితో నింపిన రాగి చెంబును ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని వాస్తు దోషం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలకాలం నిలిచి ఉంటుంది. ఇంట్లో నీటికి ఉపయోగించే వస్తువులను ఖాళీగా ఉన్న సమయంలో బోర్లించి ఉంచాలి. ఖాళీ కుండ, ఖాళీ నీటి పాత్రలు నిలబెట్టి ఉంచకూడదని గుర్తుంచుకోండి. అలా చేయడం పేదరికానికి దారి తీస్తుంది.
#3. మీ ఉద్యోగంలో పురోగతి లేకుంటే లేదా మీ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్లయితే.. శుక్రవారం నాడు లక్ష్మీదేవి మరియు కుబేరుడు కలిసి ఉన్న చిత్రపటాన్ని మీ పూజ గదిలో స్థాపించి పూజించండి. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల లక్ష్మి, కుబేరుల ఆశీస్సులు మీపై ఉండి ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.
#4. మీ ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉండాలని, ఆర్థిక సంక్షోభాన్ని ఎప్పటికీ ఎదుర్కోకూడదని మీరు కోరుకుంటే, ఇంటికి ఉత్తర దిశలో పచ్చని చెట్లను నాటండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ అంతా బయటకి వచ్చి ఐశ్వర్యం సదా మీ ఇంట కొలువై ఉంటుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
vastu tips: ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలా? అయితే ఈ టిప్స్ ను కచ్చితంగా ఫాలో అవ్వండి!
Vastu Tips: ఇంట్లో ఈ వస్తువులను పెట్టుకుంటే.. ఖచ్చితంగా ధనవంతులవుతారట..!
Vastu tips: ఇంట్లో మనీ ప్లాంట్ పెడుతున్నారా? ఈ పొరపాటు అస్సలు చెయ్యకండి.. ఎందుకంటే?