ఐపీఎల్ 2023 టోర్నమెంట్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. దారుణంగా ఓడి.. ఇంటి పాలైన సంగతి తెలిసిందే. ఒకసారి ఐపీఎల్ ఛాంపియన్ అయి…ఉండి కూడా… ఐపీఎల్ 2022, 2023 సీజన్లలో దారుణంగా ఆటతీరును కనబరిచింది. ఈ సారి మాత్రం కేవలం రెండు మ్యాచ్ లు గెలిచి..చెత్త రికార్డును మూట గట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, మరియు ఫీల్డింగ్ లోనూ అట్టర్ ఫ్లాఫ్ అయింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.
Advertisement
దీంతో వచ్చే ఐపీఎల్ 2024 టోర్నమెంట్ మాత్రం చాలా జాగ్రత్తగా ఆడి.. టైటిల్ దక్కించుకోవాలని.. హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్యా మారన్ స్కెచ్ లు వేస్తున్నారు. ఇందులో భాగంగానే… సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పులకు నాంది పలుకుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ మార్క్రమ్, కోచ్ బ్రియాన్ లారాను తప్పించాలని డిసైడ్ అయ్యారు ఓనర్ కావ్యా మారన్. ఇక వీరి స్థానంలో.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ను కొనుగోలు చేయాలని డిసైడ్ అయ్యారు.
Advertisement
అలాగే.. వీరేంద్ర సెహ్వాగ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కోచ్ గా తీసుకురావాలని కావ్యా పాప స్కెచ్ వేశారట. ఇందులో భాగంగానే ఇప్పటికే అన్ని పనులు మొదలు పెట్టారట. త్వరలోనే వీరేంద్ర సెహ్వాగ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కోచ్ గా తీసుకురానున్నారట. కాగా.. గతంలో పంజాబ్ కింగ్స్ కు వీరేంద్ర సెహ్వాగ్ మెంటర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. అలాగే.. ఐపీఎల్ లో ఢిల్లీ జట్టు తరఫున ఆడిన అనుభవం కూడా వీరేంద్ర సెహ్వాగ్ కు ఉంది. దీంతో లారాను ఇంటికి పంపించి.. వీరేంద్ర సెహ్వాగ్ తీసుకురావాలని డిసైడ్ అయ్యారట.
ఇవి కూడా చదవండి
AB de Villiers : AB డివిలీయర్స్ కు భయకరమైన వ్యాధి..నరకం అనుభవిస్తున్నానంటూ !
SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !
పవన్ కళ్యాణ్ అ***మ సంబంధం పెట్టుకున్నాడు : CM జగన్