ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి అనుకునే ప్రతి ఒక్కరూ మొదట చేసే పని నిద్ర లేవగానే మంచినీళ్లు తాగడం. చాలా మంది బరువు తగ్గడం కోసమో, శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడం కోసమో, మరే ఇతర కారణం కోసమో నిద్ర లేవగానే ఎక్కువ ఎక్కువ నీరు తాగేస్తూ ఉంటారు. అయితే.. ఇది కూడా కొన్ని ప్రమాదాలను కొని తీసుకొస్తుంది. నిజానికి ఉదయాన్నే ఎక్కువగా నీరు తాగితే సుఖ విరోచనం అవుతుంది అని చెబుతుంటారు.
Advertisement
అయితే అధికంగా నీరు తాగడం మాత్రం అనేక అపార్ధాలకు తావిస్తోందని తాజాగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధికంగా నీరు తాగడం శరీర జీవక్రియకు నష్టం చేకూరుస్తుందని చెబుతున్నారు. దాని వలన కాలేయ పనితీరు బాగా దెబ్బతింటుంది. ఇది మూత్రపిండాలు, మెదడు కణాలపై ఒత్తిడి పడేలా చేస్తుంది. కేంద్ర నాడీవ్యవస్థకు చేటు జరిగే అవకాశం ఉంటుంది.
Advertisement
అందుకే, ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు తాగడం శ్రేయస్కరం. నీరు తాగడం మంచిదే. కానీ, ఉదయాన్నే అంత ఎక్కువగా నీరు తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. దాహం అవ్వడం కారణంగా మెలకువ వస్తే, ఆ సమయంలో నీరు తాగడం వలన వచ్చే నష్టం లేదు. అలాగే, నీరు తాగేటప్పుడు నిలబడి కాకుండా కూర్చుని తాగాలి. నిలబడి నీరు తాగడం వలన ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే.. కూలింగ్ వాటర్ ని తీసుకోవడం కంటే గోరు వెచ్చని నీటిని లేదా రూమ్ టెంపరేచర్ లో ఉన్న నీటిని తీసుకోవడం మంచిది.
మరిన్ని..
ఈ 5 చిట్కాలతో మోకాళ్ళ నొప్పుల బాధ నుంచి సులభంగా బయటపడచ్చు..!
Rainy Season: వర్షాకాలంలో అధికంగా కామెర్ల వ్యాధి.. అరటిపండు అంత ప్రమాదమా?
Yawning : అదేపనిగా ఆవలింతలు రావడం అనారోగ్యానికి సంకేతమా..! నిపుణులు ఏమంటున్నారంటే..?