ఆచార్య చాణక్య సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని చక్కగా వివరించారు. లైఫ్ లో ఏ సమస్య వచ్చినా కూడా చాణక్య సూత్రాలతో మనం గట్టెక్కవచ్చు. వైవాహిక జీవితంలో సమస్యలు, స్నేహితుల మధ్య సమస్యలు, వ్యాపారంలో సమస్యలు వంటి వాటి గురించి చెప్పారు. అలానే ఎలాంటి రహస్యాలని మనం ఎవరితో పంచుకోకూడదు ఇలా ఎన్నో ముఖ్య విషయాలని చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేస్తే జీవితంలో కష్టాల నుండి సులభంగా బయటకి వచ్చేయొచ్చు. అలానే ఈరోజు చాణక్య చెప్పిన ఇంకొన్ని ముఖ్య విషయాలని చూసేద్దాం. అయితే ఏ ఇంట్లో అయినా సరే స్త్రీలు ఆనందంగా ఉండాలి అప్పుడే ఇల్లు కూడా సంతోషంగా ఉంటుందని చాణక్య అన్నారు.
Advertisement
స్త్రీలకు అహంకారం అస్సలు వుండకూడదు. ఆచార్య చాణక్య స్త్రీలకు అహంకారం అస్సలు వుండకూడదు అని చెప్పారు. అలాంటి స్త్రీ పై ఆగ్రహం కలిగి సరస్వతి, లక్ష్మీ దేవి ఇద్దరూ కూడా ఆమె నుండి దూరంగా వెళ్ళిపోతారు. కుటుంబ ఆనందం, శ్రేయస్సు క్రమంగా పోతాయి. అలానే అత్యాశ తో ఉన్న స్త్రీలు కూడా ఇబ్బంది పడాలి. ఆనందానికి, శాంతికి ప్రమాదంగా ఉంటారని చాణక్యుడు అన్నారు.
Advertisement
అలానే మహిళలు కచ్చితంగా వీటిని పాటించాలని, వీటిని పాటిస్తే ఆ ఇంట సంతోషమే ఉంటుందని చాణక్య అన్నారు. పొరపాటున కూడా ఇటువంటి తప్పులు చేయకూడదని ఇలాంటి తప్పులు స్త్రీలు చేయడం వలన ఇంటికి మంచి జరగదని చెప్పారు. చాణక్య స్త్రీ ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంటి పనులు మొదలు పెట్టుకోవాలి అని చెప్పారు స్నానం చేయకుండా ఈ పనులు స్త్రీలు చేయకూడదని అన్నారు.
స్నానము చేయకుండా వంట చెయ్యడం అస్సలు మంచిది కాదు. స్త్రీ స్నానం చేసాకనే వంటింట్లోకి వెళ్ళాలి. స్నానం చేయుండానే బీరవలోని డబ్బులు కూడా అస్సలు తీసుకోకూడదు. ఈ తప్పు చేస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. స్నానం చేయకుండా తల దువ్వుకోవడం కూడా అస్సలు మంచిది కాదు. తులసి చెట్టును స్నానం చేయకుండా తాకడం వలన కూడా సమస్యలు కలుగుతాయి. కాబట్టి స్త్రీలు స్నానం చేయకుండా ఈ పొరపాట్లని చేయకూడదు.
Also read:
- వీటిని పొరపాటున కూడా తినద్దు.. మీ జుట్టు మొత్తం రాలిపోతుంది..!
- కష్టాలు తొలగిపోవాలంటే.. గరుడపురాణం లో చెప్పిన ఈ విషయాలని తప్పక పాటించండి..!
- ఈ లక్షణాలు ఉంటే.. భార్య జీవితాంతం భర్తని ప్రేమిస్తుంది..!