తెలుగు ఇండస్ట్రీలో నటించింది తక్కువ సినిమాలే అయినా కూడా తనదైన బాడీ లాంగ్వేజ్ మరియు విలక్షణమైన గాత్రంతో అయనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు సంపత్ రాజ్. పవన్ కళ్యాణ్ పంజా మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైనా సంపత్ రాజ్.. మిర్చి సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత వరస ఆఫర్స్‌తో కెరీర్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అన్నగా , తండ్రిగా, విలన్‌గా తెలుగుతో పాటు అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో ఎన్నో పాత్రలలో నటించే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Advertisement
సినిమా ఇండస్ట్రీలో కెరియర్ పరంగా సక్సెస్ అయినా సంపత్ రాజ్.. అతని వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులతో ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో ఆయన తన జీవితాన్ని సరైన దిశలో నడిపించుకోలేక ఆత్మహత్య చేసుకోవటానికి కూడా ప్రయత్నించారట సంపత్ రాజ్. దీనిని బట్టి ఆయన నిజ జీవితంలో ఏమేరకు సమస్యలు చవిచూసారో అర్థం చేసుకోవచ్చు. సంపత్ రాజ్ భార్య ఆయన కూతురు పుట్టిన నెలరోజులకే బిడ్డను ఆయన దగ్గర వదిలి వెళ్ళిపోయి విడాకులు ఇచ్చిందట. ఇక అప్పటి నుంచి సంపత్ రాజ్ కూతురిని ఒంటరిగా పెంచాడు. తన కూతురు పెరిగి పెద్దయ్యాక కొంతకాలం క్రితమే రెండు వివాహం చేసుకున్నారు సంపత్ రాజ్.
Advertisement
ప్రస్తుతం సంపత్ రాజ్ కుటుంబ పరంగా సంతోషంగా ఉన్నాడు. కానీ మొదటి భార్యతో విడాకులు విషయంలో ఆయన అనుభవించిన నరకం గురించి సంపత్ రాజ్ స్వయంగా అనేక ఇంటర్వ్యూస్ లో తెలియజేశాడు. ఇదే సమయంలో చాలా మంది సంపత్ రాజ్ మొదటి భార్య ఎవరో తెలుసుకోకుండా ఒక నటి గురించి ఎక్కువగా చర్చిస్తూ ఉంటారు. ఈమె సంపత్ రాజ్ మొదటి భార్య అని అనేక వార్తలు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యాయి. కానీ వాస్తవానికి ఆమె సంపత్ రాజ్ మొదటి భార్య కాదు.
ఇంతకీ ఆ నటి ఎవరంటే.. అనేక చిత్రాలలో తల్లి పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన నటి శరణ్య. ఆమెకు జరిగింది కేవలం ఒక్క వివాహం మాత్రమే. ఆమె పొన్వన్నన్ అనే తమిళ నటుడిని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. శరణ్య సంపత్ రాజ్ మొదటి భార్య అని జరిగిన ప్రచారంలో అసలు నిజం లేదు . ఇక ఈమె భర్త పొన్వన్నన్ కూడా తెలుగు వారికి సుపరిచితుడే. రాధిక శరత్ కుమార్ నటించిన పిన్ని 2 సీరియల్ ద్వారా ఈయన తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
శ్రీలీలా ఈసారి ఆ స్టార్ హీరోయిన్ స్థానాన్ని పట్టేసిందిగా ..! ఇంతకీ ఏ సినిమాలోనంటే . .!
సరికొత్త బిజినెస్ మొదలుపెట్టిన హీరో ఉపేంద్ర..! ఏమి చేయబోతున్నాడంటే..!
రాజమౌళి అప్ కమింగ్ సినిమాలపై విజయేంద్ర ప్రసాద్ సెన్షేషన్ కామెంట్స్..!