తెలిసో తెలియకో కొంతమంది కొన్ని తప్పులను సాధారణంగా చేస్తూనే ఉంటారు. అయితే సూర్యాస్తమయం అయిన తర్వాత చాలామంది ఇలాంటి తప్పులను చేస్తూ ఉంటారు. సూర్యాస్తమయం తర్వాత అస్సలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి తప్పులను చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా ఇలాంటి వస్తువులను దానం చేశారంటే కచ్చితంగా పాపం తగులుతుంది. లక్ష్మీదేవి కూడా ఇంటి నుండి దూరంగా వెళ్లిపోతుంది.
Advertisement
చీకటి పడిన తర్వాత ఎప్పుడూ కూడా ఇలాంటి వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చీకటి పడిన తర్వాత ఇతరులకి పెరుగుని దానం చేయకూడదు. పెరుగు శుక్ర గ్రహానికి ప్రతీక. శుక్రుడు మన ఇంట్లో ధనాన్ని, సంతోషాన్ని కలగజేస్తాడు. కనుక సూర్యాస్తమయం తర్వాత పెరుగును ఎవరికి ఇవ్వకూడదు. అలాగే ఉల్లిపాయలను, వెల్లుల్లిపాయలను కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. అవి కూడా ఎప్పుడూ ఎవరికీ దానం చేయకూడదు. కరివేపాకును కూడా సూర్యాస్తమయం తర్వాత దానం చేయకూడదు. పాలని కూడా సూర్యాస్తమయం తర్వాత దానం చేయకూడదు. పాలని సూర్యచంద్రునికి ప్రతికగా భావిస్తారు. కాబట్టి ఈ పొరపాటున కూడా చేయకూడదు.
Advertisement
సూర్యాస్తమయం అయ్యాక ఉప్పును కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఎందుకంటే ఉప్పును సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. పసుపు కుంకుమని కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు. అలా కనుక చేస్తే మహాలక్ష్మి దేవి ఇంట్లో నుండి వెళ్లిపోతుంది. ఇలాంటివి గుర్తుపెట్టుకొని ఇకనుంచి అయినా చీకటి పడ్డాక ఈ వస్తువుల్ని అడిగితే అసలు పొరపాటున కూడా ఇవ్వకూడదు. ఇచ్చారంటే మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. సూర్యాస్తమయం తర్వాత దాన్యం కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు. సాయంత్రం సంధ్య వేళలో దీపాన్ని వెలిగించడం, ఇల్లు చీకటిగా లేకుండా చూసుకోవడం వంటివి చేయాలి. సాయంత్రం పూట తల దువ్వడం, పేలు చూసుకోవడం వంటివి కూడా చేయకూడదు. అలా చేస్తే ధన నష్టం కలుగుతుంది. కనుక ఇలాంటి పనులు సూర్యాస్తమయానికి ముందే పూర్తి చేసుకోవాలి. ఇక నుంచి అయినా ఇలాంటి పొరపాట్లను చేయకుండా ఉండాలి.