Home » సావిత్రి ఆఖరి రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ చేసిన సహాయం గూర్చి బయటకు తెలియక పోవడానికి కారణమేమిటంటే ..!

సావిత్రి ఆఖరి రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ చేసిన సహాయం గూర్చి బయటకు తెలియక పోవడానికి కారణమేమిటంటే ..!

by Mounika
Ad

సినిమా పరిశ్రమలో అగ్రస్థాయి నటీమణులుగా ఒక వెలుగు వెలిగిన అందాల తారలు ఎంతోమంది ఉన్నారు. అలాంటివారి గురించి తలచుకుంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు సావిత్రి. చూడ చక్కని రూపంతో, తన అద్భుతమైన నటనతో తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు మహానటి సావిత్రి. సినిమా కెరియర్ లో ఎంతో ఉన్నతమైన స్థాయిని చూసినా సావిత్రి ఆ తర్వాత కాలంలో తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు.

Advertisement

ముందే పెళ్ళైనా జెమినీ గణేష్ ని వివాహం చేసుకుని ఆయనకు రెండో భార్యగా వెళ్లారు సావిత్రి. జెమినీ గణేషన్ ని పెళ్లి వేసుకునే సావిత్రి కొంతకాలం తర్వాత వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడి మానసికంగా నరకం అనుభవించింది. ఆ సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగుతున్న నందమూరి తారక రామారావు మరియు అక్కినేని నాగేశ్వరరావు జెమినీ గణేష్ ను పెళ్లి చేసుకోవద్దని ఎంతో నచ్చ చెప్పి చూశారట. కానీ ప్రేమ మైకంలో సావిత్రి వారి మాటలను పట్టించుకోలేదని ఆమె గురించి బాగా తెలిసిన సినీ పెద్దలు ఎందరో తెలియజేశారు.

మొదటి నుంచి మొండి స్వభావం గల సావిత్రి వారి మాటలు వినకుండా జెమినీ గణేషన్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత అతని నిజస్వరూపం తెలుసుకుని మానసికంగా ఎంతో కృంగిపోయింది. ఆమె ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న జెమినీ గణేషన్ మీద కోపంతో సినిమాలు మానేసి తాగుడుకు బానిసవడమే కాకుండా ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోయింది. చివరి రోజుల్లో ఆమె పరిస్థితి మరింత దయనీయంగా మారడంతో ఆమెతో కలిసి నటించినవారు సైతం ఆమెకు ఎక్కడ ఆర్థిక సహాయం చేయాల్సి వస్తుందేమో అని కనిపించకుండా తిరిగేవారట.

Advertisement

అదే సమయంలో ఎన్టీఆర్ ఏఎన్నార్లు కూడా ఆమెతో ఇలాగే ప్రవర్తించే వారిని అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరిగేది. ఇక ప్రజలు కూడా ఈ ప్రచారమే నిజమని నమ్మేవారు. కానీ ఈ వార్తలో నిజం లేదని ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రిలకు సన్నిహితులుగా మెలిగిన కొందరు వ్యక్తుల ద్వారా ఈ విషయం బయటపడింది. మొదటినుంచి కూడా రామారావు మరియు నాగేశ్వరావు గార్లకు సావిత్రి అంటే చాలా ఇష్టం ఉండేదట. ఆమెకు డబ్బులు సహాయం చేయాలని వారు ఎప్పుడూ అనుకునే వారట. కానీ సావిత్రికి చాలా ఆత్మ గౌరవం ఉన్న వ్యక్తి. ఊరికినే డబ్బులు ఇచ్చేస్తే తీసుకునే మనస్తత్వం కాదని భావించి వెనక్కి తగ్గే వారట. అంతేకాకుండా వారు ఇచ్చినట్లు చెబితే సావిత్రి అసలు తీసుకోదని.. వారు ఇతరుల చేత ఇంతకు ముందు మీ వద్ద అప్పుగా తీసుకున్న డబ్బే ఇది అని చెప్పి వారి చేత సావిత్రికి ఏమాత్రం తెలియకుండా ఇప్పించేవారట.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

సినిమాల్లోకి రాకముందు కమెడియన్ సత్య అలాంటి పనులు చేసేవాడట..

అతి తక్కువ టైంలో వన్ మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించిన టాలీవుడ్ హీరోల లిస్టులో ఎవరు ముందున్నారంటే..?

చిరంజీవి వద్దన్న వినకుండా రామ్ చరణ్ నటించిన సినిమా ఏదో తెలుసా…?

Visitors Are Also Reading