ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చినటువంటి ‘బిచ్చగాడు’ సినిమా బాక్సఫీస్ వద్ద ఎన్నో సంచలనాలను సృష్టించింది. ఈ సినిమా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సినిమాలో హీరోగా విజయ్ ఆంటోనీ, హీరోయిన్ గా సాత్నా టైటస్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాతో ఈ అమ్మడు టాలీవుడ్లో తెగ పాపులర్ అయిపోయింది.
Advertisement
ఇందులో ఈ అమ్మడిది డి గ్లామర్ రోల్ అయినప్పటికీ చాలా అందంగా, అమాయకంగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా అనంతరం ఈ అమ్మడికి ఎన్నో సినిమా ఆఫర్లు వరించాయి. కానీ ఈ అమ్మడు ఒక్క సినిమాకి కూడా ఓకే చెప్పలేదు. దానికి కారణం బిచ్చగాడు సినిమా డిస్ట్రిబ్యూటర్ కార్తీక్ కారణమని తెలుస్తోంది. ఈ అమ్మడు కార్తీక్ తో ప్రేమలో పడిందట.
Advertisement
వీరి ప్రేమని కుటుంబ సభ్యులు నిరాకరించడంతో వీరిద్దరూ కలిసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారట. దాంతో సాత్న కుటుంబ సభ్యులు కార్తీక్ పై పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారని తెలుస్తోంది. ఆ తర్వాత వీరు కేసుని వెనక్కి తీసుకొని దగ్గరుండి మరి అధికారికంగా వీరిద్దరికీ అంగరంగ వైభవంగా వివాహం జరిపించారట. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించాడు. ఇక సినిమాలకు పూర్తిగా దూరమై తన కుటుంబంతో ఫ్యామిలీ లైఫ్ ను సంతోషంగా కొనసాగిస్తుంది ఈ అమ్మడు.