ప్రతి ఒక్కరూ అన్నం తినేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఎంతో పెద్ద నష్టం కలుగుతూ ఉంటుంది. ప్రతి దానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది. భోజనం చేయడానికి కూడా పద్ధతి ఉంటుంది. భోజనం చేసేటప్పుడు ఈ చిన్న చిన్న పొరపాట్లు చేస్తే సంపద పోతుంది. రాత్రి వేళల్లో అందరూ నిద్ర పోయిన తర్వాత ఆహారం తింటే సంపద పోతుంది. కాళ్ళని చాపి ఆహారాన్ని తింటే కూడా సంపద పోతుంది.
Advertisement
అప్పులు బాగా పెరుగుతాయి. తడికాళ్లతో అన్నం తింటే ఆరోగ్యం పాడవుతుంది. ఇంట్లో మూలన కూర్చొని భోజనం చేస్తే ధన నష్టం కలుగుతుంది. స్నానం చేయకుండా అన్నం తింటే ఐశ్వర్యం తగ్గిపోతుంది. దేవున్ని ప్రార్థించకుండా భోజనం చేస్తే అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు కూడా కలుగుతాయి. భోజనం చేస్తున్నప్పుడు ఇతరులతో మాట్లాడడం వల్ల దోషం తగులుతుంది. పండగ రోజు మాంసాహారం తింటే ఆరోగ్యం, కీర్తి, ఐశ్వర్యం, ప్రతిష్టలు పోతాయి.
Advertisement
ఇతరుల ఆహార పదార్థాలను దొంగిలించి తిన్నట్లయితే వారు పరమ దరిద్రాన్ని అనుభవిస్తారు. మంచం మీద కూర్చొని అన్నం తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. ధనానికి కూడా నష్టం కలుగుతుంది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు భోజనం పెడితే ఆ భోజనం తిని లోపాన్ని చూపిస్తే మహాపాపం కలుగుతుంది. వంటగదిలో కూర్చొని భోజనం చేయడం వలన దోషము కలుగుతుంది. అలాగే మానసిక సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా అన్నం తినే సమయంలో ఇలాంటి పొరపాట్లను చేయకూడదు.
ఇవి కూడా చదవండి
World Cup 2023 : ప్రపంచకప్ నుంచి పాక్ తప్పుకుంటే..అప్పుడు ఏ జట్టు ఆడుతుందో తెలుసా?
MS DHONI : కేవలం రూ. 30 లక్షల కోసమే క్రికెట్ లోకి వచ్చిన ధోని !
Tamim Iqbal : ప్రధాని వార్నింగ్.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న బంగ్లా కెప్టెన్ !