Home » పెళ్ళికి ముందు ధోని.. ఎంత మందితో డేటింగ్ చేశాడో తెలుసా ?

పెళ్ళికి ముందు ధోని.. ఎంత మందితో డేటింగ్ చేశాడో తెలుసా ?

by Bunty
Ad

టీమిండియా మాజీ కెప్టెన్, మహేంద్రసింగ్ ధోని… ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా కాదు. ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీమిండియాకు అనేక ట్రోఫీలు అందించి సక్సెస్ఫుల్ కెప్టెన్ గా పేరు దక్కించుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని. 2020లో రిటర్మెంట్ ప్రకటించిన మహేంద్రసింగ్ ధోని ఇప్పుడు రిటైర్మెంట్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా… తన భార్య సాక్షి ధోనిని పెళ్లి చేసుకోక ముందు… చాలామంది సెలబ్రిటీలతో మహేంద్రసింగ్ ధోని ప్రేమాయణం నడిపాడు.

Advertisement

ఈ విషయాలు అప్పట్లోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మొదటగా 2007 సంవత్సరంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకునే తో మహేంద్ర సింగ్ ధోని షికార్లు కొట్టాడు. దీంతో వీరి మధ్య ప్రేమాయణం నడిచినట్లు… పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇక దీపిక పడుకునే తర్వాత… తమిళ్ బ్యూటీ లక్ష్మీరాయ్ వలలోపడ్డాడు ధోని. లక్ష్మీరాయ్ తో కూడా చట్టా పట్టాలు వేసుకొని ధోని తిరిగాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా లక్ష్మీరాయ్ ఉండడానికి మెయిన్ కారణం ధోనినేనట.

Advertisement

లక్ష్మీ రాయి తర్వాత ప్రముఖ నిర్మాత ప్రీతి అనే మహిళతో కూడా ధోని ప్రేమాయణం నడిపినట్లు ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత గజినీ హీరోయిన్ ఆసిన్ తో కూడా మహేంద్రసింగ్ ధోని ప్రేమాయణం నడిపాడట. ఈమతో డేటింగ్ చేయడమే కాకుండా పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యాడట ధోని. అయితే చివరికి ఆసిన్ ఓ బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకుంది. ఇక చేసేదేమీ లేక మహేంద్రసింగ్ ధోని… తన చిన్ననాటి స్నేహితురాలు అయిన సాక్షి సింగ్ ను పెళ్లి చేసుకున్నాడు. ధోని మరియు సాక్షి జంటకు జీవా అనే కూతురు ఉన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

World Cup 2023 : ప్రపంచకప్ నుంచి పాక్ తప్పుకుంటే..అప్పుడు ఏ జట్టు ఆడుతుందో తెలుసా?

MS DHONI : కేవలం రూ. 30 లక్షల కోసమే క్రికెట్ లోకి వచ్చిన ధోని !

Tamim Iqbal : ప్రధాని వార్నింగ్.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న బంగ్లా కెప్టెన్ !

 

Visitors Are Also Reading