ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ మెగా టోర్నీ కి ఉన్న క్రేజ్ అంతా కాదు. 2007 సంవత్సరంలో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్… ఇప్పటివరకు చాలా విజయవంతంగా కొనసాగింది. ఐపీఎల్ పూర్తిగా టి20 లీగ్. దీంతో ఐపీఎల్ చూసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు. అందుకే ఈ టోర్నీ బాగా సక్సెస్ అయింది. ఇక మొన్న జరిగిన ఐపీఎల్ 2023 టోర్నమెంట్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టి.. టోర్నీని ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే.
Advertisement
ఇది ఇలా ఉండగా తాజాగా ఐపిఎల్ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ మాజీ బౌలర్ అహ్మద్ అమీర్ గురించి తెలియని వారు ఉండరు. ఈ పాకిస్తాన్ బౌలర్ అమీర్… ఐపీఎల్ టోర్నమెంట్ లో ఆడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. 2016 సంవత్సరంలో ఇంగ్లాండ్ జట్టుకు చెందిన నజ్రీస్ ఖాన్ ను పెళ్లి చేసుకున్న అమీర్… 2020 సంవత్సరం నుంచి ఇంగ్లాండ్ దేశంలోనే ఉంటున్నాడు.
Advertisement
ఇక వచ్చే సంవత్సరం ఈ పాకిస్తాన్ మాజీ బౌలర్ కు బ్రిటిష్ పౌరసత్వం కూడా రానుంది. దీంతో యునైటెడ్ కింగ్డమ్ పౌరుడిగా అమీర్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక దీనిపై అమీర్ స్పందిస్తూ… పాస్పోర్ట్ వచ్చాక అన్నిటికీ అందుబాటులో ఉంటాను.. బెస్ట్ ఛాన్స్ వస్తే అసలు వదులుకోను… అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అమీర్… బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టులోకి వస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి
టీమిండియా సెలెక్టర్ అజిత్ అగార్కర్ జీతం ఎంతో తెలుసా? ప్రధాని కంటే ఎక్కువ!
ధోనీ ‘కెప్టెన్ కూల్’ కాదు.. బూతులు తిడతాడు – ఇషాంత్ శర్మ
2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..