Home » టీమిండియా సెలెక్టర్ అజిత్ అగార్కర్ జీతం ఎంతో తెలుసా? ప్రధాని కంటే ఎక్కువ!

టీమిండియా సెలెక్టర్ అజిత్ అగార్కర్ జీతం ఎంతో తెలుసా? ప్రధాని కంటే ఎక్కువ!

by Bunty
Ad

టీమిండియా ప్రస్తుతం అత్యంత కఠిన పరిస్థితుల్లో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 13 సంవత్సరాల నుంచి ఒక్క ఐసీసీ టోర్నీ కూడా కొట్టలేక సతమతమవుతోంది. ధోని కెప్టెన్సీ లోనే ఐసీసీ టోర్నమెంట్లు వచ్చాయి తప్ప… విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ కేప్టెన్సీలలో ఏ ఒక్క ఐసీసీ టోర్నీ ని కొట్టలేకపోయింది టీమిండియా. దీంతో తాజాగా టీమిండియాను సెట్ చేసేందుకు మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగర్కర్ ను బరిలోకి దించింది.

Advertisement

టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా అజిత్ అగర్కర్ నియామకం చేసింది బీసీసీఐ పాలకమండలి. ఈ మేరకు మంగళవారం రోజున అధికారిక ప్రకటన చేసింది బీసీసీఐ. ఇక వచ్చి రాగానే అజిత్ అగర్కర్… వెస్టిండీస్ తో జరిగే టి20 లకు టీమిండియా జట్టును ఎంపిక చేసేశాడు. ఇక ఇది ఇలా ఉండగా… తాజాగా టీమిండియా కొత్త సెలెక్టర్ అజిత్ అగర్కర్ శాలరీ గురించి చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ కంటే ఎక్కువగా… అగర్కర్ జీతం తీసుకుంటున్నాడని అందరూ అంటున్నారు.

Advertisement

టీమిండియా తరఫున 26 టెస్టులు , 191 వన్డే మ్యాచ్లు, నాలుగు టి20 మ్యాచ్ లు ఆడిన అజిత్ అగర్కర్.. టీమిండియా సెలెక్టర్ హోదాలో ఏకంగా మూడు కోట్ల రూపాయల జీతం తీసుకుంటున్నట్లు స్పోర్ట్స్ ఛానల్ పేర్కొంది. మొదట్లో ఏడాదికి ఒక కోటి రూపాయలు జీతం ఉండడంతో… దానికి అగర్కర్ అంగీకారం తెలుపలేదు. దీంతో అతని జీతాన్ని మూడు కోట్లకు ఫిక్స్ చేసింది బీసీసీఐ. ఇక అజిత్ అగర్కర్ మూడు కోట్ల జీతం తీసుకోనడంతో… ప్రధాని నరేంద్ర మోడీ కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నాడని కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి మన దేశ ప్రధాని జీతం ఏడాదికి రెండు కోట్లు మాత్రమే. కానీ టీమిండియా సెలెక్టర్ అజిత్ అగర్కర్ జీతం మూడు కోట్లు. దీంతో ఇలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ధోనీ ‘కెప్టెన్‌ కూల్‌’ కాదు.. బూతులు తిడతాడు – ఇషాంత్ శర్మ

 

2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..

Praveen Kumar : టీమిండియా బౌల‌ర్ ప్ర‌వీణ్ కుమార్ కారుకు ప్ర‌మాదం

Visitors Are Also Reading