Home » YS Viveka Case : వైఎస్ వివేకా కేసులో బిగ్‌ ట్విస్‌..ఆ పిటీషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు!

YS Viveka Case : వైఎస్ వివేకా కేసులో బిగ్‌ ట్విస్‌..ఆ పిటీషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు!

by Bunty
Ad

 

వైఎస్ వివేకా కేసు విచారణ ఇంకా పూర్తి కావడం లేదు. 2019 లో చోటు చేసుకున్న వైఎస్ వివేకా కేసును ఇప్పటికి అధికారులు చేధించలేకపోతున్నారు. అయితే.. తాజాగా వైఎస్ వివేకా కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. సుప్రీం కోర్టులో ఇవాళ వైయస్ వివేకా కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్ ను డిస్మిస్ చేసింది దేశ ఉన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు. ఈ వైఎస్ వివేకా కేసును పూర్తిగా విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను హైకోర్టుకు ఇచ్చింది సుప్రీం కోర్టు న్యాయ స్థానం.

Advertisement

దస్తగిరికి క్షమాభిక్ష సవాలు చేసేందుకు అర్హత ఉన్న వ్యక్తిగా తనను గుర్తించాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు ఎంవీ కృష్ణారెడ్డి. ఇక గతంలో ఏపీ నుంచి తెలంగాణకు కేసును బదిలీ చేస్తూ వివేకా సతీమణి, కుమార్తె సునీతాలను నిజమైన బాధితులుగా గుర్తించింది సుప్రీం కోర్టు ఉన్నత న్యాయ స్థానం. ఈ నేపధ్యంలో బాధితులు ఎవరన్నదానిపై సుప్రీం కోర్టులో స్పష్టత తీసుకోవాలని ఎంవీ కృష్ణారెడ్డికి తెలిపింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు.

Advertisement

హైకోర్టు నిర్ణయంతో సుప్రీంను ఆశ్రయించారు ఎంవీ కృష్ణారెడ్డి. అయితే.. వైఎస్ వివేకా కేసులో ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఎంవీ కృష్ణారెడ్డి పిటీషన్ ను డిస్మిస్ చేసింది. ఈ కేసులో జోక్యం చేసుకోడానికి తాము సిద్దంగా లేమని తేల్చి చెప్పింది జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ల సుప్రీం కోర్టు ధర్మాసనం. వాద ప్రతివాదులకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో హైకోర్టు ముందే చెప్పుకోవచ్చని చెప్పింది సుప్రీం కోర్టు ధర్మాసనం. సుప్రీంకోర్టు అభిప్రాయాలతో సంబంధం లేకుండా… హైకోర్టు స్వతంత్రంగా తగిన నిర్ణయం తీసుకోవచ్చని వివరించారు సుప్రీం కోర్టు ఉన్నత న్యాయ స్థానం.

ఇవి కూడా చదవండి

ఏపీలో షూటింగ్‌ ఉచితమే..సీఎం కేసీఆర్‌ తో కూడా మాట్లాడతా – పోసాని కృష్ణ మురళి

Ajit Agarkar: టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్

Samantha : సినిమాలకు సమంత గుడ్ బై….రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసింది !

Visitors Are Also Reading