ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మెగా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు మన చిరంజీవి. మొదటగా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత అనేకమంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అంతేకాకుండా ఎంతోమందికి సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. ఇప్పటివరకు 150 కి పైగా చిత్రాల్లో నటించి అనేకమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుందాం…
Advertisement
ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా వెలుగొందిన కే.ఎస్ రామారావు గారు చిరంజీవికి ఆ బిరుదును ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా అభిలాష. ఈ సినిమా చాలా హిట్ అయింది. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికీ ఐదు సినిమాలు వచ్చాయి. అందులో రాక్షసుడు, చాలెంజ్ వంటి సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. రాక్షసుడు సినిమాతోనే మెగాస్టార్ తమ్ముడు నాగబాబు కూడా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
Advertisement
అయితే చిరంజీవి, కె.ఎస్ రామారావు కాంబినేషన్లో వచ్చిన నాలుగవ సినిమా మృదంగం. ఈ సినిమా సమయంలోనే చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ అనే బిరుదును జోడించారు. ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేక పోయింది. కానీ చిరంజీవికి మాత్రం మెగాస్టార్ అనే బిరుదును తెచ్చి పెట్టింది ఈ సినిమా. ఇక అప్పటినుంచి ప్రతి ఒక్క సినిమాలో చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ అనే బిరుదు చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఇవి కూడా చదవండి
తలలో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయా…?
కూతురు పుట్టిన సంతోషంలో 300 కోట్లు రాసిచ్చిన ఉపాసన!
బీరువాలో వీటిని పెట్టడం వల్ల అప్పులు తీరుతాయి…ఆదాయం వస్తుంది!