శరీర తత్వాన్ని బట్టి శరీరంపై అవాంఛిత రోమాలు వస్తుంటాయి. ఈ అవాంఛిత రోమాలు అందరికి ఉంటాయి. అయితే వారి తత్వాన్ని బట్టి ఎక్కువగానో, తక్కువగానో ఉంటాయి. అయితే, ఈ వెంట్రుకలు కొంతమందికి కాలిపై కూడా ఉంటాయి. కాలిపై ఉండే వెంట్రుకలను బట్టి సదరు వ్యక్తుల ఆరోగ్యం గురించి చెప్పేయచ్చట. ఈ వెంట్రుకలని బట్టి గుండె ఆరోగ్యం తెలుస్తుందట.
Advertisement
అసలు గుండెకు, కాలిపై ఉండే వెంట్రుకలకు మధ్య ఉండే సంబంధం ఏమిటో ఇప్పుడు చూద్దాం. వెంట్రుకలు శరీరంలో ఏ భాగంలో రావాలన్నా వాటికి పోషకాలు కావాలి. చర్మం లోపలి నుంచి ఈ వెంట్రుకలు మొలుస్తాయి. అయితే ఇవి పెరగాలంటే మాత్రం వీటికి రక్త సరఫరా జరుగుతూ ఉంటేనే పెరుగుతాయి. కణాలు నిర్మాణం అయ్యే కొద్దీ ఈ వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి.
Advertisement
ఒకవేళ కాలి వద్ద సరిగ్గా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోతే, ఈ వెంట్రుకలు ఆ ప్లేస్ లో పెరగవు. బ్లడ్ సర్క్యూలేషన్ అవుతూ ఉంటేనే శరీరంలో వెంట్రుకలు మొలుస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలా చేసే ధమనుల్లో ఆటంకం కలిగితే రక్త ప్రసరణకు కూడా ఆటంకం ఎదురవుతుంది. మనం తినే ఆహరం వల్లే ధమనుల్లో కొవ్వు పెరిగి ఆటంకం ఏర్పడుతుంది. ఇది ఎక్కువైతే రక్త సరఫరా సరిగ్గా జరగదు. చేతులపై వెంట్రుకలు వస్తే రక్తప్రసరణ బాగుందని అనుకోకూడదు. ఎందుకంటే, చేతులు గుండెకు దగ్గరగా ఉంటాయి. కానీ, కాళ్ళు దూరంగా ఉంటాయి. అందుకే కళ్ళకి వెంట్రుకలు మొలిస్తే.. మీ రక్త ప్రసరణ బాగుందని అర్ధం.
మరిన్ని ముఖ్య వార్తలు:
31 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చిన మహిళ 90 ఏళ్లలో డెలివరీ.. ఆశ్చర్యపోయిన వైద్యులు..!
సూపర్ టైం టేబుల్ ని సెట్ చేసుకున్న ఆరేళ్ల చిన్నవాడు..? చూస్తే కచ్చితంగా నవ్వుకుంటారు.