Ad
మద్రాస్ లో లా చదువుతున్న ఈ కుర్రాడు. ఉదయం కాలేజ్ కి వెళ్లి, మధ్యాహ్నం నుండి స్టూడియోల వెంట తిరిగేవాడు. చిన్నప్పటి నుండే అనేక నాటకాల్లో నటించిన అనుభవంతో సినిమాలోఛాన్స్ కోస మద్రాస్ లోని స్టూడియోలకు తన ఫోటోలు తీసుకొని వెళ్లేవాడు. అలా మొదటి సారి పొన్నులూరి బ్రదర్స్ వారు ఈ కుర్రాడికి “దైవబలం” అనే సినిమాలో NTR పక్కన చిన్న వేషం ఇచ్చారు. చిత్రంలో రామారావు సరసన ఒక పాత్ర ఇచ్చారు.
Advertisement
ఆ వేషం సంపాదించుకున్నది, ఈ ఫోటోలో ఉన్నది ఒక్కరే…..ఆయనే శోభన్ బాబు! ఈ ఫోటో భక్త శబరి సినిమా ప్రమోషన్ కోసం అప్పటి పత్రికల్లో వేయించింది. ఈ ఫోటోతో సినిమా ప్రమోషన్ ఏమైందో ఏమోకానీ శోభన్ బాబు అందానికి ఫ్యాన్ బేస్ ను ఏర్పడేలా చేసింది. ఇది శోభన్ బాబుకు చాలా ప్లస్ అయ్యింది.
Advertisement
- 1969లో “లోగుట్టు పెరుమాళ్లకెరుక” అనే సినిమాతో సోలో హీరో గా నటించాడు అది అంతగా ఆడకపోయినా …అదే ఏడు వచ్చిన “మనుషులు మారాలి” సినిమా సిల్వర్ జూబ్లీ అయ్యింది. దాంతో తెలుగు నాట శోభన్ బాబు పేరు మార్మోగిపోయింది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ శోభన్ బాబు కు కనెక్ట్ అయిపోయారు. విచిత్రమేంటంటే ఎన్టీఆర్ , ఎన్నార్ అభిమానులు శోభన్ బాబుకు కామన్ అభిమానులుగా ఉండేవారు.
- దాదాపు 200 సినిమాల్లో నటించిన శోభన్ బాబు….. సినిమా జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేసేవారు. 6 తర్వాత ఇంటికెళ్లి ఇంట్లోనే గడిపేవారు.
- తనను అందాల నటుడిగా చూసిన జనాలు, తనను ఎప్పటికీ అలాగే గుర్తుంచుకోవాలని 60సంవత్సరాల తర్వాత ఏ సినిమాలకు గుడ్ బై చెప్పాడు!