ఆరోగ్యమే మహా భాగ్యం అని పెద్దలు ఊరికే చెప్పలేదు. మన శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటె మనం అంత ప్రశాంతంగా ఆలోచించి, మన పనులను చేసుకోగలుగుతాము. మన శరీరంలో చిన్న అనారోగ్యం చేసినా మన శరీరం మనకి సంకేతాలను చూపిస్తూ ఉంటుంది. ఈ సంకేతాలను బట్టి మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మన శరీరం మనకి చూపించే సంకేతాల్లో గోళ్లు ఒకటి.
Advertisement
మన గోళ్లు లేత గులాబీ రంగులో ఉంటూ సమయానుసారం పెరుగుతూ ఉంటేనే మనం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు. మన శరీరంలో ఏమైనా లోపాలు ఉంటె.. మన గోర్లు చూడాలి. మన గోళ్ళని బట్టి మనకు ఏదైనా అనారోగ్యం ఉంటె చెప్పేయచ్చు. మీ గోళ్లపై ఈ ఫొటోలో చూపించినట్లు నిలువు గీతలు కనిపిస్తున్నాయా? అయితే మీ శరీరం ప్రోటీన్ లోపంతో ఇబ్బంది పడుతోందని అర్ధం.
Advertisement
ప్రోటీన్ లోపం ఉంటె జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. కొత్త జుట్టు మొలవదు. ఏ చిన్న పని చేసినా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. ఎక్కువగా చర్మంపై ముడతలు పడుతూ ఉంటాయి. చిన్న వయసు లోనే పెద్ద వారిలా కనిపిస్తూ ఉంటారు. ఏమైనా దెబ్బలు తగిలితే అవి మానడానికి ఏక్కువ సమయం పడుతుంది. ప్రోటీన్ లోపం ఉంటె ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే జాగ్రత్తలు తీసుకుని సరైన పోషకాహారం తీసుకోవాలి.
మరిన్ని ముఖ్య వార్తలు:
30 ఏళ్ల వయసు దాటిన మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?
ముక్కుపై పింపుల్స్ వస్తున్నాయా? అయితే అసలు కారణం ఇదే.. తప్పక జాగ్రత్తపడండి..!
మైదా తో కలిగే నష్టాలు చూసారంటే.. అస్సలు ముట్టుకోరు..!