నటసింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పటికే బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ గా నిలవగా అఖండ తో వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ నమోదు అయ్యింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు బాలకృష్ణ 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విజయం తరువాత బాలయ్య తన రెమ్యునరేషన్ భారీగా పెంచినట్టు ఫిలిం నగర్ లో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం బాలయ్య ఆహా ఓటిటి కోసం అన్ స్టాపబుల్ టాక్ షో కు హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.
Advertisement
అయితే ఈ టాక్ షో కోసం బాలయ్య ఎపిసోడ్ కు 40 లక్షలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తం పన్నెండు ఎపిసోడ్ లు ఉండగా దాదాపు 5 నుండి 6 కోట్ల వరకు బాలయ్య తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాలయ్య తన తదుపరి సినిమాను గోపీచంద్ కన్ఫ్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం బాలయ్య ఏకంగా 15 నుండి 20 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. దానికి నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్టు టాక్. ఇక బాలకృష్ణ చేతిలో ప్రస్తుతం మొత్తం మూడు నుంచి నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇక త్వరలోనే వీటి పై అప్డేట్స్ వెలువడనున్నాయి.
Advertisement