సాధారణంగానే మహిళలకు అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. పీరియడ్స్ మొదలైనప్పటి నుంచి వారి శరీరం అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఇక పెళ్లి అయ్యిన తరువాత, గర్భం దాల్చిన తరువాత ఈ మార్పులు మరింత ఎక్కువ అవుతాయి. ఈ క్రమంలో వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ముప్పై ఏళ్ల వయసుకు చేరుకున్న తరువాత వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Advertisement
వయసు పైబడే కొద్దీ అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. వయసు పెరుగుతున్న కొద్దీ మహిళలు ఎక్కువగా థైరాయిడ్, షుగర్, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఎదుర్కొంటు ఉంటారు. వీటిని బీట్ చేయడానికి ఒత్తిడి తగ్గించుకోవాలి. డైట్ లో కొన్ని మార్పులను చేసుకోవాలి. సిట్రస్ ఫ్రూట్స్ అంటే బత్తాయి, ఆరంజ్, నిమ్మ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
Advertisement
గుడ్లు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కూడా విటమిన్ డి, హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్స్ ను పొందవచ్చు. ఇక వెల్లుల్లిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే బ్రెస్ట్ కాన్సర్ రాదు. అలాగే కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
మరిన్ని ముఖ్య వార్తలు
మీ ఇంట్లో గీజర్ ఉందా? అయితే ఈ తప్పులను అస్సలు చెయ్యకండి… ఎందుకంటే?
ముక్కుపై పింపుల్స్ వస్తున్నాయా? అయితే అసలు కారణం ఇదే.. తప్పక జాగ్రత్తపడండి..!