Home » ముక్కుపై పింపుల్స్ వస్తున్నాయా? అయితే అసలు కారణం ఇదే.. తప్పక జాగ్రత్తపడండి..!

ముక్కుపై పింపుల్స్ వస్తున్నాయా? అయితే అసలు కారణం ఇదే.. తప్పక జాగ్రత్తపడండి..!

by Srilakshmi Bharathi
Ad

మన శరీరం స్వతహాగా తన అనారోగ్యాన్ని తానే నయం చేసుకునే విధంగా రూపొందించబడింది. కానీ, మన నిర్లక్ష్యం, మారుతున్న అలవాట్లు, లైఫ్ స్టయిల్ కారణంగా శరీరం త్వరగా కోలుకోవడం లేదు. అయితే.. మన శరీరంలో ఏదైనా సుస్తీ చేస్తే, వెంటనే మన శరీరం మనకి కొన్ని సిగ్నల్స్ పంపిస్తుంది. ఉదాహరణకు ఒళ్ళు వేడెక్కడం, ముఖం పై పింపుల్స్ రావడం వంటివి.

pimples 1

Advertisement

ముఖం పై మొటిమలు వస్తే చిరాకు పడని వారెవ్వరూ ఉండరు. వాటి వాళ్ళ ముఖం అందం పోతోందని బాధపడే వారు ఎక్కువమంది ఉంటారు. అయితే పేస్ పై ఒక్కో చోట వచ్చే పింపుల్ కు ఒక్కో కారణం ఉంటుంది. ఒకవేళ మీ బుగ్గలపై మొటిమలు వచ్చాయని అనుకోండి.. దాని వలన మీ దంతాలతో సమస్య ఉందని అర్ధం. అయితే, రిఫ్లెక్సాలజీ సాయంతో కొన్ని నిర్దిష్టమైన చోట్ల మసాజ్ చేయడం ద్వారా ఆయా వ్యాధులను దూరం చేయచ్చట.

pimples

Advertisement

నుదుటి భాగంలో మొటిమలు కనిపిస్తే, మీ డైజెస్టివ్ సిస్టం సరిగా పని చేయడం లేదని అర్ధం. ఇలా వచ్చినప్పుడు జంక్ ఫుడ్ మానేసి చల్లని దోసకాయ ముక్కలను తినండి. కొద్దీ రోజులు ఇలా చేస్తే మార్పు మీకే కనిపిస్తుంది. ఈ మొటిమలు కనుబొమ్మల మధ్యలో వస్తే మీ లివర్ పని చేయట్లేదని అర్ధం. బుగ్గలపై కంటి కిందగా మొటిమలు వస్తే ఊపిరితిత్తులు సరిగా పని చేయట్లేదని అర్ధం. పొగ తాగడం మానివేయండి. పొగ తాగేవారికి దూరంగా ఉండండి. గడ్డంపై మొటిమలు వస్తే వారికి హార్మోన్ల అసమతుల్యత ని సూచిస్తుంది. ముఖ్యంగా రుతు సంబంధ సమస్యలు ఉండేవారికి ఇవి ఎదురవుతాయట. ఇక ముక్కుపై మొటిమలు వస్తే వారి గుండె పనితీరు సరిగా లేదని అర్ధమట. ఒక వేళ హై బిపి ఉన్నా కూడా ఇలా ముక్కుపై మొటిమలు వస్తాయట.

మరిన్ని వార్తలు:

చిన్న పని చేసినా చెమటలు కక్కేస్తున్నారా? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!

మీ ఇంట్లో గీజర్ ఉందా? అయితే ఈ తప్పులను అస్సలు చెయ్యకండి… ఎందుకంటే?

మధుమేహం నుంచి మలబద్ధకం వరకు చాలా సమస్య చెక్ పెట్టే మ్యాజికల్ డ్రింక్ ఇదే..!

Visitors Are Also Reading