Home » రవిబాబు సినిమాల్లో పూర్ణ ఎక్కువగా నటిస్తుంది ఎందుకో తెలుసా…!

రవిబాబు సినిమాల్లో పూర్ణ ఎక్కువగా నటిస్తుంది ఎందుకో తెలుసా…!

by Bunty
Ad

రవిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం యాక్టర్ గానే కాకుండా డైరెక్టర్ మరియు నిర్మాతగా వ్యవహరిస్తాడు. ఇప్పటివరకు 75 పైగా చిత్రాల్లో నటించాడు. ఎక్కువగా విలన్ పాత్రలలో నటిస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. అవును, అవును 2 వంటి హారర్ సినిమాల్లో నటించి ఎంతోమంది ప్రేక్షకులను ఫిదా చేశారు. అయితే రవి బాబు ప్రతి సినిమాలో పూర్ణా పేరు తప్పకుండా వినిపిస్తుంది. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి.

Advertisement

ఇప్పుడు ఇంకో సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే రవి బాబు ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా పూర్ణ గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘పూర్ణతో నాకు లవ్ ఎ**ర్ ఉంది. అలా అని ఏదేదో ఊహించుకోకండి. ప్రతి డైరెక్టర్ కి తన నటులతో అలాంటి అనుబంధమే ఉంటుంది. నాకు కూడా పూర్ణ మీద అలాంటి అనుబంధమే ఉంది. ప్రతి డైరెక్టర్ చెప్పిన దానికి నటీనటులు 10 నుంచి 20% ఎక్కువగా నటిస్తూ ఉంటారు.

Advertisement

కానీ పూర్ణ మాత్రం డైరెక్టర్ చెప్పిన దానికంటే 200 శాతం ఎక్కువగా నటిస్తుంది. నేను చేసే సినిమాల్లో హీరోయిన్ అనగానే నాకు కచ్చితంగా పూర్ణానే గుర్తుకువస్తుంది. హీరోయిన్ పాత్రకు పూర్ణ తనవంతు న్యాయం చేస్తుంది. తను న్యాయం చేయగలను అని భావిస్తేనే సినిమాకి ఓకే చెబుతుంది. లేకపోతే నేను నటించను అని కరాకండిగా చెప్పేస్తుంది. నాకోసం మాత్రం అస్సలు ఒప్పుకోదు’ అని రవి బాబు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

Sri Reddy : “బోళా శంకర్” పరువు తీసిన శ్రీరెడ్డి.. చిరంజీవి సినిమాలన్ని రీమేక్ లే ?

టీమిండియా నుంచి ఔట్‌.. పుజారా సంచలన నిర్ణయం

దేశముదురు సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా…!

Visitors Are Also Reading