Home » ఫిల్టర్ లేకున్నా నువ్వు అలానే ఉంటావ్ అంటూ అమ్మాయి కామెంట్…అల్లు శిరీష్ ఫైర్…!

ఫిల్టర్ లేకున్నా నువ్వు అలానే ఉంటావ్ అంటూ అమ్మాయి కామెంట్…అల్లు శిరీష్ ఫైర్…!

by AJAY
Ad

అల్లు వారి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో అల్లు శిరీష్. గౌరవం అనే సినిమాతో అల్లు శిరీష్ చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత శిరీష్ కొత్తజంట, ఒక్క క్షణం, శ్రీరస్తు శుభమస్తు, ఏబిసిడి ఇలా వరుస సినిమాల్లో నటించాడు. అయితే ఈ చిత్రాల్లో మారుతి దర్శకత్వంలో వచ్చిన కొత్త జంట మినహా మిగతా ఏ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలవ లేకపోయాయి. ఇక ప్రస్తుతం అల్లు శిరీష్ “ప్రేమ కాదంటావా” అనే సినిమాలో నటిస్తున్నాడు.

Allu Shirish

Allu Shirish

ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు అను ఇమ్మాన్యుయేల్ తో ఎక్కువ క్లోజ్ గా ఉండటంతో అల్లు వారి అబ్బాయి రిలేషన్ షిప్ లో ఉన్నాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే అల్లు శిరీష్ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు. తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను శిరీష్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. అదే విధంగా అప్పుడప్పుడు అభిమానులతో లైవ్ లోకి వచ్చి ముచ్చటిస్తారు. అయితే తాజాగా అల్లు శిరీష్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న ఒక ఫిల్టర్ ను ఉపయోగించి వీడియో చేశారు.

Advertisement

Advertisement

 

అయితే ఈ వీడియోకు ఓ అమ్మాయి నెగిటివ్ కామెంట్ చేసింది. “అల్లు బాబు ఫిల్టర్ ఎఫెక్ట్ లేకుండా నీ ముఖం ఒరిజినల్ గా కూడా అలానే ఉంటుంది” అంటూ కామెంట్ చేసింది. అయితే ఆ కామెంట్ కి అల్లు శిరీష్ హర్ట్ అయినట్టు కనిపిస్తోంది. దాంతో అభిమానికి అల్లు శిరీష్ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. “నామీద కామెంట్ చేసావ్ అని హర్ట్ అవ్వలేదు సిస్టర్. కానీ డిపిలో ఉన్న ఈ అమ్మాయి కూడా అందంగా గురించి మాట్లాడుతుంది అని ఫీల్ అవుతున్న… లాల్ హ్యాపీ న్యూయర్.” నువ్వు కూడా ఫిల్టర్లు వాడు ప్లీజ్. అంటూ శిరీష్ రిప్లై ఇచ్చాడు. దాంతో ఆ అమ్మాయికి మంచిగా బుద్ది చెప్పావ్ అని శిరీష్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

 

Also read : బాడీ షేప్ కోసం కష్టపడుతున్న బుట్ట బొమ్మ…వర్కౌట్ చూస్తే చెమటలు పట్టాల్సిందే…!

Visitors Are Also Reading