సమ్మర్ లో ఎక్కువగా చెమటలు పట్టడం సాధారణం. ఎక్కడికీ వెళ్లకుండా ఇంటిపట్టునే ఉన్నా.. ఉక్కపోత, వేడి గాలుల కారణంగా చెమటలు పట్టడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. సమ్మర్ ను పక్కన పెడితే, మిగతా సీజన్లలో అంత ఉక్కపోత ఉండదు. సమ్మర్ లో మాత్రం ఎక్కువగా చమటలు పట్టేస్తూ ఉంటాయి. కానీ, కొందరికి మాత్రం సీజన్ తో సంబంధం లేకుండా చమటలు పడుతూ ఉంటాయి.
Advertisement
దీనితో ఈ వేడి తట్టుకోలేక ఫ్యాన్ ని ఎక్కువ స్పీడ్ లో పెట్టుకుంటాం. అయితే ఫ్యాన్ ను ఎక్కువ స్పీడ్ లో పెట్టుకునే ముందు కొన్ని విషయాలను గమనించాలి. ఫ్యాన్ ను ఎక్కువ స్పీడ్ లో పెట్టుకునే ముందు వాటి రెక్కలు ఎలా ఉన్నాయో గమనించాలి. ఒకవేళ ఫ్యాన్ రెక్కలు పూర్తిగా దుమ్ము పట్టి ఉంటె, ఫ్యాన్ ఎక్కువ స్పీడ్ తిరిగినప్పుడు ఆ దుమ్ము గదంతా వ్యాపించి నాసికారంధ్రాలకు పట్టేస్తుంది. నిరంతరం గాలి తగులుతూ ఉంటె కండరాలు బిగుసుకుపోతుంటాయి.
Advertisement
అందుకే రాత్రిపూట పడుకునేటప్పుడు ఫ్యాన్ స్పీడ్ తగ్గించుకోవడం మంచిది. ఉక్కపోతకు నిద్ర పట్టకపోతే తడి గుడ్డతో ఒంటికి కాపడం పెట్టుకోవాలి. సాయం సమయాల్లో స్నానం చేయడం వలన ఉక్కపోత చిరాకు తగ్గి హాయిగా అనుభూతికి లోనవుతారు. మధ్యాహ్న సమయంలో కిటికీలు, తలుపులు మూసి ఉంచడం వలన వేడి ఇంటిలోపలికి రాదు. ఫలితంగా గది చల్లగా ఉంటుంది.
మరిన్ని ముఖ్య వార్తలు:
100కు పైగా సినిమాలు చేసిన తెలుగింటి హీరోయిన్…చికిత్సకు డబ్బులు లేక చివరకు….!
Virat Kohli : వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ బౌలింగ్ …?
‘నా ప్రియమైన అన్నయ్య…!’ వైరల్ అవుతున్న మోక్షజ్ఞ ట్వీట్!