అమెజాన్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఆన్లైన్ షాపింగ్ హబ్. ఇందులో దొరకని వస్తువు అంటూ ఏదీ ఉండదు. అలాగే ప్రపంచం నలుమూలల్లో ప్రతి ప్రదేశానికి అమెజాన్ వస్తువులను డెలివర్ చేస్తుంది. అయితే.. అమెజాన్ ఈ స్థాయికి చేరడానికి వెనుక చాలా కాలం శ్రమ ఉంది. 1994లో జెఫ్ బెజోస్ ఓ చిన్న గదిలో దీనిని స్థాపించారు. అమెజాన్ స్థాపించిన మొదటిలో అమెజాన్ లోగో వేరేలా ఉండేది.
Advertisement
1994లో రూపొందించబడిన, మొదటి అమెజాన్ చిహ్నం కేవలం “Amazon.com అనే పదాలతో రివర్ అమెజాన్‌గా శైలీకృతం చేయబడింది. మొదటిలో అమెజాన్ బిగ్గెస్ట్ బుక్ స్టోర్ గా ఉండేది. బిగ్గెస్ట్ బుక్ స్టోర్ అనే అక్షరాలు కూడా లోగో కింద రాయబడి ఉండేవి. 1997 తరువాత నుంచి అమెజాన్ తన లోగోలపై ప్రయోగాలు చేయడం మొదలు పెట్టింది. అలా చాలా లోగోలను ట్రై చేసింది. కొంతకాలం అమెజాన్ కింద కేవలం ఒక స్మైల్ లాంటి గీత మాత్రమే ఉండేది.
Advertisement
ప్రస్తుతం మాత్రం, ఈ యారో ఉన్న లోగో ట్రెండ్ అవుతోంది. a నుంచి z వరకు అన్ని వస్తువులు అమెజాన్ లో లభిస్తాయి అని చెప్పడమే ఈ లోగో ఉద్దేశ్యం. ఇంకా, ఈ లోగో కింద యారో స్మైల్ ని కూడా చూపిస్తోంది. ఆంగ్ల వర్ణమాల యొక్క మొదటి నుండి చివరి అక్షరం వరకు ఈ మార్గం అంటే ఇ-కామర్స్ వెబ్‌సైట్ సమగ్రమైన ఉత్పత్తులను అందిస్తుంది. అలాగే, బాణం నిరంతర వృద్ధిని మరియు లక్ష్యాలను సాధించడంలో పట్టుదలను సూచిస్తుంది. చాలా తెలివిగా ఈ లోగోను డిజైన్ చేసారు.
ఇవి కూడా చదవండి
వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ లో అరుదైన సంఘటన..భర్త లేకుండా నిహారిక, భార్య లేకుండా పవన్ ?
మెకానిక్ తో కీర్తి సురేష్ రొమాన్స్.. మండిపడుతున్న అభిమానులు
Upasana : మెగా కోడలు ఉపాసన ఆస్తుల విలువ ఎంతో తెలుసా…?