రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2007లో చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ వరుస సినిమాలతో దూసుకుపోయాడు. చిరంజీవి తనయుడు కావడంతో రామ్ చరణ్ తో సినిమాలు చేసేందుకు దర్శకుడు సైతం పోటీపడేవారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రపంచమంతటా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే రామ్ చరణ్ అతి చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు.
Advertisement
ఆ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. చిన్నతనంలో రామ్ చరణ్ చాలా క్యూట్ గా, ముద్దుగా ఉండడంతో దర్శకులు సైతం రామ్ చరణ్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేయడానికి పోటీపడేవారట. అయితే చిరంజీవి నటించిన లంకేశ్వరుడు సినిమాలో రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారట. ఆ సినిమాలో రామ్ చరణ్ అంతగా నటించకపోవడంతో ఎడిటింగ్ లో తీసేసారని సమాచారం.
Advertisement
అతి చిన్న వయసు కావడంతో చరణ్ యాక్టింగ్ చేయడానికి ఇబ్బందిపడేవారట. దీంతో చిరంజీవి తను పెద్దయ్యాక సినిమాల్లోకి తీసుకువస్తానని చెప్పారట. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్, ఉపాసన అనే అమ్మాయిని 14 జూన్, 2012న వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన 12 సంవత్సరాలకి వారిద్దరూ జూన్ 20, 2023న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా కుటుంబంలో ఆనందాలు చిగురించాయి.
ఇవి కూడా చదవండి
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్స్ వీళ్లేనా?
Ramcharan-Upasana: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
అబ్బాయిలు ఇలా ఉంటే అమ్మాయిలు విపరీతంగా ఇష్టపడతారు…!