అలనాటి అందాల తార సౌందర్య గురించి తెలియనివారు ఉండరు. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు చేయకుండా చాలా సాంప్రదాయమైన పాత్రలు చేసేది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం కన్నడం మలయాళం భాషలలో 100కు పైగా చిత్రాల్లో నటించింది. 31 సంవత్సరాల వయసులోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది.
Advertisement
ఆమె మరణ వార్త విన్న కుటుంబసభ్యులు, సినీ ప్రేమికులు కన్నీరు మున్నీరయ్యారు. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికీ ఆమె సినిమాలు చూస్తూ ఉంటే మనతో ఉన్నట్టుగానే ఉంటుంది. ఆనతికాలంలోనే అగ్ర హీరోలు అందరి సరసన నటించి వేలకోట్ల రూపాయల ఆస్తులను సంపాదించింది సౌందర్య. ఆమె మరణించిన అతి కొద్ది రోజుల్లోనే ఆస్తి గురించి గొడవలు జరిగాయి.
Advertisement
ఆస్తి తనకే కావాలని సౌందర్య భర్త రఘు… సౌందర్య రాసిన వీలునామా ప్రకారం మాకు కూడా ఆస్తులు పంచాలని అమర్నాథ్ భార్య నిర్మల, ఆమె కుమారుడు సాత్విక్ కోర్టును ఆశ్రయించారు. అసలు సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు ప్రచారం సృష్టించారని సౌందర్య తల్లి కోర్టుకు తెలియజేశారు. ఇక ఆ తర్వాత కుటుంబ సభ్యులు అందరూ రాజీకి వచ్చి ఆస్తిని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇవి కూడా చదవండి
రానాకు కిడ్నీ సమస్య.. అసలు విషయం చెప్పిన దగ్గుబాటి హీరో
RGV గారి అల్లుడు ఎవరు? రామ్ గోపాల్ వర్మ భార్య ఎవరు?
టాలీవుడ్ హీరోస్ తీసుకున్న వరకట్నాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే….!