Home » చిరంజీవికి మొత్తం ఎంత మంది మనవరాళ్లు అంటే..?

చిరంజీవికి మొత్తం ఎంత మంది మనవరాళ్లు అంటే..?

by Sravya
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారు ఉండరు. చాలా మంది చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని సినిమాల్లోకి వస్తూ ఉంటారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆయనలా పెద్ద స్టార్ హీరో అవ్వాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. స్వయంకృషితో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ఒక బ్రాండ్ ని సంపాదించుకున్నారు. ఆయనతో పాటుగా మెగా ఫ్యామిలీ నుండి చాలా మందిని హీరోలుగా మార్చేశారు. మెగా ఫ్యామిలీ నుండి చాలామంది హీరోలు ఇప్పటికే వచ్చారు.

Advertisement

తాజాగా మెగాస్టార్ చిరంజీవి తాత అయ్యారు మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఉపాసన పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చారు. వీళ్ళ వివాహమై 11 ఏళ్ళు అయ్యింది. అయితే అప్పటి నుండి కూడా ఎప్పుడూ చరణ్ చిరంజీవి చేతి లో బిడ్డని పెడతారా అని ఎదురు చూశారట. ఇప్పటికి అది నిజం అయింది. రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు అవ్వడంతో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి.

Advertisement

అటు ఇండస్ట్రీలో పెద్దలు, హీరోలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు మరొక సారి తాతగా ప్రమోషన్ పొందారని అభిమానులు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఆయనకి ఎంతో ఇష్టమైన మంగళవారం నాడు మహా లక్ష్మి పుట్టడం సంతోషంగా ఉందని చిరంజీవి కూడా పంచుకున్నారు. చిరంజీవికి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కి సమర, సంహిత అని ఇద్దరు ఆడపిల్లలు.

శ్రీజ కి నివృత్తి, నవిష్క ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు కుమార్తెలకి ఇద్దరు పిల్లలు చొప్పున మొత్తం ఇక్కడికి నలుగురు మనవరాళ్లు ఉన్నారు. ఉపాసన చరణ్ కి కూడా కూతురు పుట్టడంతో మొత్తం ఇప్పుడు చిరంజీవికి ఐదుగురు మనవరాళ్లు ఉన్నారు. మహాలక్ష్మి ల సంఖ్య చిరు కుటుంబంలో పెరుగుతోందని అభిమానులు కామెంట్లు చేశారు. ఇది ఇలా ఉంటే ఈ ఏడాది చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా తో మంచి హిట్ ని అందుకున్నారు. ప్రస్తుతం భోళా శంకర్ తో బిజీగా ఉన్నారు చిరు.

Also read:

చరణ్ కి పాప పుట్టిందని.. ఆనందంతో పవన్ కళ్యాణ్ ఏం చేసారు అంటే..?

సంఖ్యా శాస్త్రం ప్రకారం రామ్ చరణ్ కూతురి జాతకం ఎలా ఉండనుంది..? మంచిదేనా..?

Visitors Are Also Reading