ఒకప్పుడు వేడి నీళ్లు కావాలంటే గంటల తరబడి పొయ్యి పై కాచి.. వాటిని బకెట్స్ లో పోసుకుని బాత్ రూమ్ వద్దకు తీసుకువెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని ఆ అవసరం తప్పింది. చాలా కాలం నుంచే గీజర్ అందరికి అందుబాటులోకి వచ్చింది. దీనితో అందరు వేడి నీళ్ల కోసం గీజర్ ను వాడుతున్నారు. స్నానానికి వేడి నీళ్లు కావాలంటే పది నిమిషాల ముందు స్విచ్ వేస్తె సరిపోతుంది.
అయితే.. ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి షాక్ కొట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తడి చేత్తో స్విచ్ వేయడం అస్సలు మంచిది కాదు. అయితే గీజర్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి తప్పులను పొరపాటున కూడా చెయ్యకూడదో ఇప్పుడే తెలుసుకోండి.
Advertisement
Advertisement
చాలా మంది గీజర్ ఒకసారి ఆన్ చేసి, ఆ తరువాత ఆఫ్ చేయడం మర్చిపోతారు. గీజర్ ఎక్కువ సేపు ఆన్ లో ఉంటె పేలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే కచ్చితంగా వాడుకోవడం అయ్యాక గీజర్ ని ఆపేయాలి.
గీజర్ పెట్టించుకున్న వారు కచ్చితంగా ఎగ్జాక్ట్ ఫ్యాన్ కూడా పెట్టించుకోవాలి. ఎందుకంటే గీజర్ నుంచి మీథేన్, ప్రొపేన్ వంటి వాయువులు విడుదల అయ్యి కార్బన్ డై ఆక్సయిడ్ గా మారతాయి. అందుకే కచ్చితంగా ఫ్యాన్ పెట్టించుకోవాలి.
గీజర్ ను ఫిక్స్ చేయించేటప్పుడు నిపుణులు మాత్రమే ఫిక్స్ చెయ్యాలి. తెలిసి తెలియని నాలెడ్జితో గీజర్ ని ఫిక్స్ చేస్తే మీరే ఇబ్బందుల్లో పడతారు. ఇక ఏమైనా రిపేర్లు వస్తే ఆన్ లైన్ లో చూసి మీరే చేయవద్దు. కచ్చితంగా ఎలెక్ట్రిషియన్ ను పిలిపించండి.