Home » రోడ్డుపై బ్రేక్ లైన్ తర్వాత సాలిడ్ లైన్ ఉంటే దాని అర్థం ఏమిటి? అసలు విషయం ఇదా!

రోడ్డుపై బ్రేక్ లైన్ తర్వాత సాలిడ్ లైన్ ఉంటే దాని అర్థం ఏమిటి? అసలు విషయం ఇదా!

by Srilakshmi Bharathi
Ad

హై వే లపై మనం తరచుగా బ్రేక్ లైన్స్ చూస్తూనే ఉంటాం. రోడ్డు మధ్యలో గ్యాప్స్ తో కూడిన వైట్ లైన్ ఉంటుంది. కొన్ని చోట్ల ఈ బ్రేక్ లైన్ ఉండాల్సిన చోట వైట్ స్ట్రెయిట్ లైన్ ఉంటుంది. ఇలా వైట్ స్ట్రెయిట్ లైన్ ఎందుకు ఉంటుంది? దీని అర్ధం ఏమిటి అని సైబరాబాద్ పోలీసులు ఇటీవల ట్విట్టర్ లో ప్రశ్నించారు.

road rules

Advertisement

ఇలా బ్రేక్ లైన్ ఉన్న చోటు నుంచి లైన్ సడన్ గా స్ట్రెయిట్ గా మారితే బండి నడిపే వ్యక్తులు కేవలం తాము ఉన్న దారిలోనే బండి నడపాలి తప్ప లైన్ మారడానికి ప్రయత్నించకూడదు అని అర్ధం. ఈ విషయమై అవగాహనా కలిగించడం కోసమే సైబరాబాద్ పోలీసులు ట్విట్టర్లో ఈ ప్రశ్నని సంధించారు.

road rules

Advertisement

కాగా పోలీసులు అడిగిన ఈ ప్రశ్నకి చాలా మంది కరెక్ట్ గానే సమాధానం ఇచ్చారు. సాలిడ్ లైన్ ఉంటె లైన్ క్రాస్ చేయలేము అని ఒక యూజర్ సమాధానం ఇవ్వగా.. ఓవర్ టెక్ చేయకూడదు.. లైన్ మారకూడదు అని మరో యూజర్ సమాధానం ఇచ్చాడు. నో లైన్ క్రాసింగ్ అని మరో యూజర్ రెస్పాండ్ అయ్యాడు. మరొకొందరేమో పోలీసులపై ఫైర్ అయ్యారు. ముందు రోడ్లు సరిగ్గా వేసి, అప్పుడు నీతులు చెప్పాలి అన్నారు. మరొకరు ఏమో.. అసలు ఏ లైన్ లేకుంటే ఏమి చేయాలన్నారు? ఎందుకంటే ఇలాంటి లైన్స్ కేవలం సంపన్నులు ప్రయాణించే రోడ్ పైనే ఉంటాయని అన్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మరోసారి విలన్ గా ఎంట్రీ ఇవ్వనున్న రానా.. హీరో ఎవరంటే ?

రాకేష్ మాస్టర్ కి శేఖర్ మాస్టర్ అంటే అంత ప్రేమనా ?

రామ్ చరణ్ కూతురి జాతకం చెప్పిన సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి! మొదటి సారి పాజిటివ్ గా!

Visitors Are Also Reading