పెళ్లి అంటే నూరేళ్ళ పంట. వేద మంత్రాల సాక్షిగా ఏడడుగులు వేసి ఒక్కటిగా మారిన జంట అన్యోన్యంగా ఉండాలని బంధుమిత్రులంతా దీవిస్తారు. అలా పవిత్రంగా పెళ్లిని జరిపించడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. ఒక్కో ఆచారం వెనుక భార్య భర్తలు కలిసి ఉండాలి దీవించే బలమైన ఆశీర్వచనం ఉంటుంది.
Advertisement
అయితే ఈ ఆచారాలను పక్కన పెట్టి పొరపాట్లను చేయడం వలన అవే వారికి భవిష్యత్తులో ఆటంకాలు అవుతుంటాయి. పవిత్రంగా జరగాల్సిన పెళ్లి వేడుకలో తప్పులు దొర్లడం వలన భవిష్యత్లో వారి కాపురానికి ఇబ్బందులు కలుగుతుంటాయి. సాధారణంగా పెళ్లి తంతులో తలంబ్రాలు పోసుకున్న తరువాత చాలా మంది ధర్మాకోల్ బాల్స్ ని కూడా వేస్తున్నారట. ఇలా ధర్మకోల్ బబుల్స్ ను ఎప్పటికీ వేసుకోరాదని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన ఇరు వర్గాల బంధువుల మధ్యా గొడవలు వస్తాయట.
Advertisement
అందుకే వీటిని వాడకుండా తలంబ్రాలు మాత్రమే వాడాలట. ఇంకా కొందరు పెళ్లి మండపం పైకి చెప్పులు వేసుకునే వెళ్లి ఆశీర్వదిస్తారు. ఇలా చేయడం వలన మండపం పై కొలువై ఉన్న దేవతలు కోపం వచ్చి వెళ్ళిపోతారట. జంటని దీవించడానికి వచ్చిన దేవతలు వెళ్లిపోవడం శుభకరం కాదు. అందుకే ఇలా చేయకూడదు. ఇంకా పెళ్లి పనులు ఎక్కువ అవుతుండడం వలన కొందరు తాళి కట్టడాన్ని కూడా ఆలస్యం చేస్తారు. అనుకున్న సమయానికి తాళి కట్టకపోయినా ఆ వధూ వరుల మధ్య గొడవలు వచ్చి చివరకు విడిపోయేవరకూ వెళ్తారట. అందుకే ఈ పొరపాట్లను అస్సలు చేయకూడదు.
మరిన్ని ముఖ్య వార్తలు:
బిల్వ ఆకుని ఇలా వాడితే ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ఎలానో చూడండి!
ఆ 2 రోజుల్లో పొరపాటున కూడా నల్లని దుస్తులు వేసుకోకండి.. ఎందుకంటే?
ఆషాడ మాసంలో నవ దంపతులను ఎందుకు దూరం పెడతారో తెలుసా..?