మీరెప్పుడైనా గమనించారా? ఎక్కువ సేపు నీటిలో నుంచున్నా, చేతులు పెట్టినా, లేదా స్విమ్మింగ్ పూల్ లో ఎక్కువ సేపు గడిపినా కూడా చేతి వేళ్ళు, కాలి వేళ్ళపైన చర్మం ముడతలు పడినట్లుగా అయిపోతుంది. అయితే, ఇలా ఎందుకు అవుతుంది అన్న సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా? నీటిలో ఉన్నప్పుడు చర్మం ఎందుకు ముడతలు పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
నీటిలో ఉన్నపుడు చర్మం ముడతలు పడవచ్చు అని అనుకుంటే.. స్విమ్మింగ్ పూల్ లో ఎంత సేపు ఉన్నా కేవలం చేతులు కాళ్ళ వద్ద మాత్రమే చర్మం ముడతలు పడుతుంది. మిగతా చర్మం మామూలుగానే ఉంటుంది. అసలు నీళ్ళల్లో ఉన్నప్పుడు చర్మం ఎందుకు ముడతలు పడుతుంది? మిగతా చర్మం మామూలుగానే ఉన్నా.. చేతులు, అరికాళ్ళ వద్ద మాత్రమే చర్మం ఎందుకు ముడతలు పడుతుంది? అన్న ప్రశ్నకు సమాధానం ఇప్పుడే తెలుసుకోండి.
Advertisement
చర్మం అన్ని శరీర అవయవాల కంటే పెద్ద అవయవం. లోపల ఉన్న అన్ని అవయవాలకు చర్మం రక్షణ కల్పిస్తుంది. లోపల ఉన్న అవయవాలు సక్రమంగా పనిచేసేలా రక్షణ ఇస్తుంది. ఒకవేళ చర్మానికి ఏమైనా దెబ్బలు తగిలితే మాత్రం తనకు తానే నయం చేసుకుంటుంది. కానీ అరచేతుల్లో, అరికాళ్ళలో చర్మానికి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఈ చర్మంలో కేరాటిన్ అనే ప్రోటీన్ పదార్ధం ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడి చర్మం మాత్రమే నీటిలో ఉన్నపుడు ముడతలు పడుతుంది. అయితే.. ఈ ముడతలు పడటానికి పట్టే సమయం ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి మారుతుంది. అలానే.. చల్లని నీటి కంటే, వేడి నీటి వలన చర్మం త్వరగా ముడతలు పడుతుంది.
మరిన్ని ముఖ్య వార్తలు:
భార్య ప్రెగ్నెన్సీ సమయంలో భర్త చేయాల్సిన పనులు…ఆ పని తప్పా!
ఈ 4 లక్షణాలు కనుక భార్యలో ఉంటే.. భర్త పరాయి ఆడదాని స్వాధీనమైనట్లే..!
మీ భార్య గొడవ పడితే ఇలా కూల్ చేయండి !